డ్రగ్స్ కేసు : విచార‌ణ‌కు హాజ‌రైన దీపికా

డ్రగ్స్ కేసు : విచార‌ణ‌కు హాజ‌రైన దీపికా
x

Deepika Padukone reaches NCB office

Highlights

Deepika Padukone Reaches NCB Office : డ్రగ్స్ కేసులో భాగంగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణె నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) విచారణకు హాజరైంది. తన మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌తో కలిసి ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయానికి శనివారం ఉదయం 9.45 గంటలకు చేరుకుంది దీపికా...

Deepika Padukone Reaches NCB Office : డ్రగ్స్ కేసులో భాగంగా బాలీవుడ్ నటి దీపికా పదుకొణె నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్‌సీబీ) విచారణకు హాజరైంది. తన మేనేజర్ కరిష్మా ప్రకాశ్‌తో కలిసి ముంబైలోని ఎన్‌సీబీ కార్యాలయానికి శనివారం ఉదయం 9.45 గంటలకు చేరుకుంది దీపికా... ఈ కేసులో అరెస్టయిన రియా చక్రవర్తి.. రకుల్ ప్రీత్ సింగ్, దీపికా, సారా అలీఖాన్, శ్రద్ధా కపూర్‌ల పేర్లను వెల్లడించడంతో ఒక్కొక్కరిని పిలిపించి విచారిస్తున్నారు ఎన్‌సీబీ అధికారులు. నిన్న రకుల్‌ను విచారించగా.. ఇవాళ మిగతా ముగ్గురిని ప్రశ్నించనున్నారు. ఇక గోవాలో ఉన్న పదుకొనే తన భర్త రణ్‌వీర్ సింగ్‌తో కలిసి గురువారం ముంబై చేరుకున్నారు.


అటు శుక్రవారం రకుల్ ప్రీత్ సింగ్ ని ఎన్‌సిబి అధికారులు సుమారుగా నాలుగు గంటల పాటు విచారణ చేశారు. ఈ విచారణలో రకుల్ తానూ డ్రగ్స్ చాట్ మాత్రమే చేశానని, డ్రగ్స్ తీసుకోలేదని వెల్లడించింది. దీనిపైన ఎన్‌సీబీ డైరెక్టర్‌ జనరల్‌ అశోక్‌ జైన్‌ మాట్లాడుతూ.. " 'సిట్‌ రకుల్‌ప్రీత్‌ సింగ్‌ ఇచ్చిన స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. దాన్ని విశ్లేషించి, నివేదికను కోర్టుకు సమర్పించనున్నాం' అని వెల్లడించారు. రకుల్‌ కూడా మరో నలుగురు సెలబ్రిటీల పేర్లు చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది.

ఇక బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ అనుమానాస్పద మృతి కేసులో ఈ డ్రగ్స్ కోణం బయటకు వచ్చిన సంగతి తెలిసిందే.. దీనిపైన నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి ) విచారణ చెప్పట్టింది.. అయితే ఈ కేసులో ముందు నుంచి కీలక సూత్రధారిగా ఉన్న సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ప్రియురాలు రియా చక్రవర్తిని ఎన్‌సిబి అధికారులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే.ఈ విచారణలో రియా చిత్ర పరిశ్రమకు చెందిన 25 మంది సెలబ్రిటీల పేర్లను చెప్పినట్టుగా జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి. రియా చెప్పినట్టుగా ఎన్‌సిబి కూడా అధికారికంగా పలువురు పేర్లను వెల్లడించింది.

Show Full Article
Print Article
Next Story
More Stories