Sekhar Kammula Next Movie: లక్కీ ఛాన్స్ .. వెంకీని డైరెక్ట్ చేయనున్న శేఖర్ కమ్ముల!

Sekhar Kammula Next Movie: లక్కీ ఛాన్స్ .. వెంకీని డైరెక్ట్ చేయనున్న శేఖర్ కమ్ముల!
x
Highlights

Sekhar Kammula Next Movie: ఆనంద్ ఓ మంచి కాఫీ లాంటి సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల..

Sekhar Kammula Next Movie: ఆనంద్ ఓ మంచి కాఫీ లాంటి సినిమాతో దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల.. ఆ తర్వాత హ్యాపీ డేస్, లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్, లీడర్ సినిమాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు.ఇక ఫిదా సినిమాతో నిజంగానే ఆడియన్స్ ని ఫిదా చేశాడు. ప్రస్తుతం శేఖర్ కమ్ముల నాగచైతన్య, సాయి పల్లవి హీరో హీరోయిన్స్ గా 'లవ్ స్టోరీ' అనే సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ సినిమా పైన మంచి అంచనాలను క్రియేట్ చేసాయి. ఈ సినిమాని సమ్మర్ లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ముందుగా అనుకున్నారు. కానీ కరోనా ప్రభావం వల్ల కుదరలేదు.

అయితే ఈ సినిమా తరవాత ''లవ్ స్టోరీ'' సినిమాని తెరకెక్కిస్తున్న ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ ప్రొడక్షన్ లోనే మరో సినిమాని చేసేందుకు శేఖర్ కమ్ముల ఫిక్స్ అయ్యాడు... లవ్ స్టోరీ మూవీ కంటెంట్ మీదున్న నమ్మకం, శేఖర్ పనితనం నచ్చిన ప్రొడ్యూసర్ నారాయణ్ దాస్ నారంగ్ తమ తరవాత సినిమా కూడా శేఖర్ కమ్ములనే చేయమని కోరగా దీనికి శేఖర్ కమ్ముల వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. అయితే ఈ సినిమాలో ఓ స్టార్ హీరో నటించనున్నాడని గత కొంతకాలంగా ప్రచారం సాగుతోంది.. అయితే ఆ స్టార్ హీరో వెంకటేష్ అని తెలుస్తోంది.. ఇప్పటికే ఈ సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ ని వెంకీకి శేఖర్ వినిపించడాని, వెంకీకి కూడా కథ బాగా నచ్చి ఒకే చెప్పాడని తెలుస్తోంది..

ఈ సినిమా కూడా శేఖ‌ర్ క‌మ్ముల‌ స్టైల్లోనే సాగుతుందని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్.ఎల్.పి బ్యానర్ పై నారాయణ్ దాస్ నారాంగ్ నిర్మించనున్నారు.ఈ మూవీ గురించి మిగతా విషయాలు త్వరలో ఆఫీషియల్ తెలియజేయనున్నారు.

ఇక అటు వెంకటేష్ హీరోగా నారప్ప అనే సినిమాని చేస్తున్నాడు..ఫ్యామిలీ మూవీ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతుంది. సురేష్ ప్రొడక్షన్స్ పై సురేష్ బాబు ఈ సినిమాని తెరకెక్కిస్తున్నారు.. ఇందులో వెంకీ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది.. దాదాపుగా షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాని కరోనా ప్రభావం తగ్గాక విడుదల చేయాలని మేకర్స్ ఆలోచిస్తున్నారు. ఈ సినిమా తర్వాత వెంకీ శేఖర్ కమ్ముల సినిమా చేయనున్నాడు.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories