AyPilla Musical : ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా..!

ప్రేమ కథలను అందంగా తెరపైకి ఎక్కించడంలో దర్శకుడు శేఖర్ కమ్ముల రూటే సపరేటు..ఇప్పుడు అదే తరహాలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు శేఖర్ కమ్ముల.

Krishna
Updated on: 14 Feb 2020 4:49 PM IST
AyPilla Musical : ముద్దు పెడితే ఏడుస్తారా అబ్బా..!
X

ప్రేమ కథలను అందంగా తెరపైకి ఎక్కించడంలో దర్శకుడు శేఖర్ కమ్ముల రూటే సపరేటు..ఇప్పుడు అదే తరహాలో నాగచైతన్య, సాయి పల్లవి జంటగా ఓ సినిమాని తెరకెక్కిస్తున్నారు శేఖర్ కమ్ముల .. ఈ సినిమాకి 'లవ్‌స్టోరీ' అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ రోజు ప్రేమికుల దినోత్సవం సందర్భంగా సినిమాకి సంబంధించిన 'ఏయ్ పిల్లా' అనే ప్రివ్యూ వీడియోను రిలీజ్ చేశారు. నిమిషం ఆరు సెకండ్స్ ఉన్న ఈ వీడియోలో సాయిపల్లవి, నాగచైతన్య జంట బాగా ఆకట్టుకుంటుంది.

ఇక వీడియోలో భాగంగా మెట్రోలో సాయి పల్లవి.. నాగచైతన్య బుగ్గపై ముద్దుపెట్టేస్తుంది. దీనితో షాక్ అయిన నాగచైతన్య ఎమోషనల్ అయిపోయి ఏడుస్తాడు. అప్పుడు సాయి పల్లవి... 'ముద్దు పెడితే ఎవరైనా ఏడుస్తారా అబ్బా' అని అడగడం వీడియోకి మోస్ట్ హైలెట్ గా నిలిచింది. ఈ మ్యూజికల్‌ ప్రివ్యూలో సంగీత దర్శకుడు పవన్‌ సీహెచ్‌ మంచి పాటను అందించారు. దీనిపైన నాగచైతన్య భార్య సమంత ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. చాలా బాగుందని సంతోషించింది.

ఈ సినిమాని ఎమిగోస్‌ క్రియేషన్స్, సోనాలి నారంగ్‌ సమర్పణలో నారాయణ్‌దాస్‌ కె. నారంగ్, పి. రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శేరావేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని వచ్చే ఏడాది వేసవిలో రిలీజ్ చేయనున్నారు. ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.


Krishna

Krishna

Next Story