Sai pallavi లవ్ స్టొరీ... మేకర్స్ మరో సర్‌ప్రైజ్!

హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

Krishna
Updated on: 9 May 2020 2:33 PM IST
Sai pallavi  లవ్ స్టొరీ... మేకర్స్ మరో సర్‌ప్రైజ్!
X
Sai Pallavi

హీరోయిన్ సాయి పల్లవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చేసింది కొన్ని సినిమాలే అయినప్పటికీ మంచి పేరు సంపాదించుకుంది. స్వతహాగా మలయాళం అమ్మాయి అయినప్పటికీ తెలుగులో తనకు తానే సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటుంది. ఇక డాన్స్ లో కూడా ప్రత్యేకత చాటుకుంటోంది.. సాయి పల్లవి ఈరోజు (మే 9) పుట్టినరోజు జరుపుకుంటుంది.. ఈ సందర్భంగా ఆమె నటిస్తున్న 'లవ్ స్టొరీ' సినిమా నుంచి సప్రైజ్ లూక్ ని విడుదల చేసింది చిత్ర బృందం..

అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి ప్రధాన పాత్రలతో తెరకెక్కుతున్న లవ్ స్టోరీ సినిమాకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహిస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన సాంగ్, టీజర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా సాయి పల్లవి పుట్టిన రోజు కావడంతో మేకర్స్ ఆమెకు బర్త్ డే విషెష్ చెబుతూ తాజాగా ఈ సినిమా నుంచి సాయి పల్లవి లుక్ రిలీజ్ చేశారు. అందులో సాయి పల్లవి వర్షంలో తడుస్తూ నాచురల్ లుక్‌లో కనిపిస్తూ ఆకట్టుకుంటుంది. సినిమాలోని సాయి పల్లవి కొత్త లుక్ ని రిలీజ్ చేస్తూ హీరో అక్కినేని నాగచైతన్య ఆమెకి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సినిమాని ఎమిగోస్‌ క్రియేషన్స్, సోనాలి నారంగ్‌ సమర్పణలో నారాయణ్‌దాస్‌ కె. నారంగ్, పి. రామ్మోహన్‌రావు నిర్మిస్తున్నారు. శేరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాని ఈ ఏడాది వేసవిలో రిలీజ్ చేయలని అనుకున్నారు. కానీ కరోనా వైరస్ ప్రభావం వలన సినిమా వాయిదా పడింది. ఇక ఫిదా సినిమా తర్వాత శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపైన భారీ అంచనాలు ఉన్నాయి.




Krishna

Krishna

Next Story