Sanjay Raut : కంగనా వ్యాఖ్యలపై సంజయ్‌ రౌత్‌ ఫైర్‌

Sanjay Raut : బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌, శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ల మధ్య గత కొద్ది రోజులుగా మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే

Krishna
Published on: 4 Sept 2020 6:39 PM IST
Sanjay Raut : కంగనా వ్యాఖ్యలపై సంజయ్‌ రౌత్‌ ఫైర్‌
X

Sanjay Raut : బాలీవుడ్‌ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్‌, శివసేన ఎంపీ సంజయ్‌ రౌత్‌ ల మధ్య గత కొద్ది రోజులుగా మాటల యుద్ధం నడుస్తున్న సంగతి తెలిసిందే.. అయితే తాజాగా ముంబై పోలీసులపై విశ్వాసం లేకుంటే నగరంలోకి రావద్దని అంటూ ఎంపీ సంజయ్‌ రౌత్‌ తనను బెదిరించారని కంగనా తీవ్ర వాఖ్యలు చేసింది. అయితే ఈ వాఖ్యాలపైన సంజయ్‌ రౌత్‌ స్పందించారు.

"మేం ఎవరినీ బెదిరించబోమని, ముంబై నగరాన్ని పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌(పీఓకే)తో పోల్చేవారికి పీఓకే గురించి ఏమీ తెలియదు.. ముంబై, మహారాష్ట్రలను కించపరచడాన్ని తాము సహించబోమని " అన్నారు. అంతేకాకుండా ఆమె వెనుక అనేక రాజకీయ పార్టీలు ఉన్నాయని అన్నారు. అంతకుముందు కంగనా ముంబై పోలీసులపై నమ్మకం లేకపోతే ముంబైలో అడుగుపెట్టరాదని శివసేన నేత తనను బెదిరించారని, ముంబైని చూస్తే పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌లా ఎందుకు కనిపిస్తోందని ఆమె ట్వీట్‌ చేశారు.

ఇక తాజాగా తనని ముంబై లోకి రానివ్వమని పలువురు బెదిరింపులు వస్తున్న నేపధ్యంలో వచ్చే సెప్టెంబర్ 9 వ తేదిన తానూ ముంబై వస్తున్నానని, అక్కడకి వచ్చాక ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక సమయాన్ని కూడా పోస్ట్ చేస్తానని ఎవరైనా వచ్చి తనను అడ్డుకుంటారో చూస్తానని ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అటు కంగనా ప్రస్తుతం తన స్వస్థలమైన మనాలి, హిమాచల్ ప్రదేశ్ లో తన కుటుంబంతో కలిసి ఉన్నారు.

Krishna

Krishna

Next Story