Kangana Ranaut : బెదిరింపులకి కంగనా స్ట్రాంగ్ రిప్లయ్.. ఎవరు వస్తారో చూస్తానంటూ ట్వీట్!

Kangana Ranaut : టాలీవుడ్ యువ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఫైర్ బ్రాండ్ కంగానా రనౌత్ బాలీవుడ్ లోని పలువురుపైన

Krishna
Published on: 4 Sept 2020 3:00 PM IST
Kangana Ranaut : బెదిరింపులకి కంగనా స్ట్రాంగ్ రిప్లయ్.. ఎవరు వస్తారో చూస్తానంటూ ట్వీట్!
X

Kangana Ranaut 

Kangana Ranaut : టాలీవుడ్ యువ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం తర్వాత ఫైర్ బ్రాండ్ కంగానా రనౌత్ బాలీవుడ్ లోని పలువురుపైన ఆరోపణలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తూ వస్తుంది. ఆమె చేసే వాఖ్యలు ప్రస్తుతం సంచలనం రేపుతున్నాయి. ఈ క్రమంలో ఆమెకి కొన్ని బెదిరింపులు ఎదురయ్యయాని పలు మార్లు వెల్లడించింది. తన ఇంటి సమీపంలో కూడా ఎవరో కాల్పులు జరిగినట్టుగా కంగనా పేర్కొంది. అయితే తాజాగా తనని ముంబై లోకి రానివ్వమని పలువురు బెదిరింపులు ఇచ్చారని వెల్లడించింది.

ఈ క్రమంలో వచ్చే సెప్టెంబర్ 9 వ తేదిన తానూ ముంబై వస్తున్నానని, అక్కడకి వచ్చాక ఎయిర్ పోర్ట్ లో ల్యాండ్ అయ్యాక సమయాన్ని కూడా పోస్ట్ చేస్తానని ఎవరైనా వచ్చి తనను అడ్డుకుంటారో చూస్తానని ట్వీట్ చేసింది. ఇప్పుడు ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక అటు కంగనా ప్రస్తుతం తన స్వస్థలమైన మనాలి, హిమాచల్ ప్రదేశ్ లో తన కుటుంబంతో కలిసి ఉన్నారు. అటు శివసేన ఎంపి సంజయ్ రౌత్ తనను బెదిరించారని కంగానా తన ట్విట్టర్ లోఆరోపించారు.

Krishna

Krishna

Next Story