వైరల్ అవుతున్న సమంత వాల్టింగ్ ఫిట్నెస్ వీడియో..

సమంత ఏం చేసినా సంచలనం ఇప్పుడు. సోషల్ మీడియాలో తరుచు అభిమానులను పలకరించే సమంత అక్కినేని ఇప్పుడు తాజాగా ఓ ఫిట్ నెస్ వీడియో తో సంచలనం సృష్టిస్తున్నారు.

K V D Varma
Updated on: 22 Aug 2019 12:19 PM IST
వైరల్ అవుతున్న సమంత వాల్టింగ్ ఫిట్నెస్ వీడియో..
X

ఓహ్..బేబీ సినిమా విజయం సాధించిన తరువాత సమంత గ్రాఫ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆమె తరువాతి ప్రాజెక్టుపై కూడా అందరిలోనూ ఆసక్తి ఏర్పడిపోయింది. ఇప్పడు సమంత ఏమి చేసినా సంచలనమే. సోషల్ మీడియాలో ఎక్కువగా కనిపించే ఈ అక్కినేని కోడలు.. తరచు ఫిట్ నేస్ కి సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకుంటూవుంటారు. ఇప్పుడు అదే తరహాలో ఆమె ఇంస్తాగ్రాం లో పోస్ట్ చేసిన ఓ వీడియో అందరిలోనూ ఆసక్తిని పెంచింది. ఇప్పటికే సోషల్ మీడియాలో ఆ వీడియో సంచలనంగా మారింది.

ఇంతకీ ఆ వీడియోలో ఏముందంటే.. బూడిద రంగు టైట్స్‌తో తెల్లటి స్లీవ్‌లెస్ టీ ధరించిన సమంతా అక్కినేని వాల్టింగ్ ఫిట్నెస్ ప్రాక్టీస్ చేస్తున్నారు. శారీరక శక్తి ని మరింత పెంచుకునేందుకు ఈ ప్రాక్టీస్ చేస్తారు. అంతే కాకుండా ఎప్పుడూ కొత్త విషయాల్ని నేర్చుకోవడానికి భయపడకూడదు అంటూ మెసేజ్ కూడా ఆ వీడియోకి జత చేశారు సమంత. ఎప్పుడూ ఫిట్ నెస్ తో ఉండే సమంత ఇప్పుడు ఈ సరికొత్త ప్రాక్టీసులో దర్శనమిచ్చేసరికి అందరిలోనూ ఎన్నో అనుమానాలు కలుగుతున్నాయి. కొత్త సినిమా కోసం సమంత ఈ ప్రయత్నాలు చేస్తోందని చెప్పుకుంటున్నారు. ఈ వీడియో పై అభిమానులు మాత్రం తమ సంతోషాన్ని వ్యక్త్రం చేస్తున్నారు. అందరిలోనూ శారీరకంగా ధృడంగా ఉండాలనే ఆకాంక్షను పెంచడానికి ఆమె ఇటువంటి పోస్ట్ లు పెడతారంటూ చెప్పుకుని మురిసిపోతున్నారు. ఫిట్ నేస్ కి తమ అభిమాన నటి ఇచ్చే ప్రాధాన్యం చూసి ముచ్చట పడిపోతూ కామెంట్స్ పెడుతున్నారు.

అందరినీ అలరిస్తున్న ఆ వీడియో మీరూ చూసేయండి..


Instagramలోని ఈ పోస్ట్‌ని వీక్షించండి

Never be afraid to try new things .. you will be surprised at what you're capable of .. loving parkour @abhinavparkour #mightymouse

Samantha Akkineni (@samantharuthprabhuoffl) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది


K V D Varma

K V D Varma

Next Story