Sadak 2 Movie : 'సడక్‌ 2' కు దారుణమైన రేటింగ్‌!

Sadak 2 Movie : సడక్‌ 2 కు దారుణమైన రేటింగ్‌!
x

Sadak 2 Movie

Highlights

Sadak 2 Movie : భారీ అంచనాల మధ్య ఆగస్టు 28 న ఓటీటీలో విడుదలైన చిత్రం ‘సడక్‌ 2’.. ఆలియాభట్‌ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కగా, ఆమె

Sadak 2 Movie : భారీ అంచనాల మధ్య ఆగస్టు 28 న ఓటీటీలో విడుదలైన బాలీవుడ్ చిత్రం 'సడక్‌ 2'.. ఆలియాభట్‌ ప్రధాన పాత్రలో ఈ సినిమా తెరకెక్కగా, ఆమె తండ్రి మహేష్‌ భట్‌ ఈ సినిమాని తెరకెక్కించారు. యూట్యూబ్‌ లో విడుదలైన ఈ సినిమా ట్రైలర్ ప్రేక్షకులకు నచ్చలేదు.. కోటికి పైగానే డిస్‌లైకులతో అత్యధికమంది ఇష్టపడని యూట్యూబ్‌ వీడియోగా రికార్డు క్రియేట్ చేసింది. ఇక సినిమా విడుదలయ్యాక దాదాపుగా పదివేల మంది ప్రేక్షకులు ఐఎండీబీలో 10కి 1.1 స్టార్‌ రేటింగ్‌ ఇచ్చారు.

దీనితో ఐఎండీబీలో అత్యంత దారుణమైన రేటింగ్ వచ్చిన సినిమాగా రికార్డు సృష్టించింది. దాదాపు వెయ్యి ఓట్లను గణించి ఐఎండీబీ ఈ రేటింగ్ ఇచ్చింది. ఇక ఈ సినిమా తర్వాత 1.3 రేటింగ్ తో టర్కీ సినిమా రెండో స్థానంలో ఉండగా, హిమ్మత్‌వాలా 1.7, వర్మ ఫైర్‌ 1.7, అభిషేక్‌ బచ్చన్‌ ద్రోణ, హిమేష్‌ రేష్మియా కర్జ్‌ చిత్రాలు 2 రేటింగ్‌ ని దక్కించుకున్నాయి. ఇక ఈ సినిమాలో అలియా భట్ , సంజయ్ దత్, ఆదిత్య రాయ్ కపూర్ ప్రధాన పాత్రలు పోషించారు. దాదాపు 20 ఏళ్ళ అనంతరం సడక్ కి సీక్వెల్ గా వచ్చిన సినిమా కావడం.. అంచనాలకు ఈ సినిమా అందుకోకపోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద దారుణంగా ఫెయిల్ అయింది.

బాలీవుడ్ దివంగత నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణం అనంతరం బాలీవుడ్‌ సెలబ్రిటీలపై నెటిజన్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలియాభట్, మహేష్ భట్ తదితరుల స్టార్ లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వస్తున్నారు. అందులో భాగంగానే సడక్‌ 2 ట్రైలర్‌ విడుదల కావడంతో డిస్‌లైక్‌ కొట్టుతూ వచ్చారు. దీనితో అత్యధికమంది ఇష్టపడని యూట్యూబ్‌ వీడియోగా రికార్డు క్రియేట్ చేసింది ఈ సినిమా.

Show Full Article
Print Article
Next Story
More Stories