Sadak 2 Release in Online: ఓటీటీలో విడుదలకి సిద్దం అవుతున్న సడఖ్ 2!

Sadak 2 Release in Online: ఓటీటీలో విడుదలకి సిద్దం అవుతున్న సడఖ్ 2!
x
Highlights

Sadak 2 Release in Online:లాక్ డౌన్ ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడింది..అందులో సినిమా ఇండస్ట్రీ కూడా ఒకటి.. షూటింగ్ లు ఆగిపోవడం, థియేటర్లు బంద్ కావడంతో సినిమా ఇండస్ట్రీ అయితే కొన్ని కోట్ల నష్టాన్ని చవిచూసింది..

Sadak 2 Release in Online: లాక్ డౌన్ ఎఫెక్ట్ అన్ని రంగాలపై పడింది..అందులో సినిమా ఇండస్ట్రీ కూడా ఒకటి.. షూటింగ్ లు ఆగిపోవడం, థియేటర్లు బంద్ కావడంతో సినిమా ఇండస్ట్రీ అయితే కొన్ని కోట్ల నష్టాన్ని చవిచూసింది.. ప్రస్తుతానికి షూటింగ్ లకి అయితే అనుమతి లభించింది కానీ థియేటర్ల పరిస్థితి పై మాత్రం ఎలాంటి క్లారిటీ రాలేదు.. కరోనా రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలో ఇప్పట్లో ధియేటర్లు ఓపెన్ అయ్యే ఛాన్స్ అయితే కనిపించడం లేదు.. దీనితో విడుదలకి సిద్దంగా ఉన్న మూవీస్ ని ఓటీటీలో రిలీజ్ చేసేందుకు మేకర్స్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు..

అందులో భాగంగానే ఇప్పటికే అమితాబ్, ఆయుష్మాన్ ఖురానా న‌టించిన గులాబో సితాబో చిత్రం విడుద‌ల సినిమాలు ఓటీటీ లో రిలీజ్ అయి మంచి టాక్ ను సంపాదించుకున్నాయి.. ఇక ఇదే బాటలో స‌డఖ్ 2 సినిమాని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.. ఇందులో సంజయ్ దత్, పూజా భట్‌లతో పాటు అలియా భట్, ఆదిత్య రాయ్ కపూర్ కనిపించనున్నారు. 1991లో మ‌హేశ్ భ‌ట్ ద‌ర్శ‌క‌త్వంలో వచ్చిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్న. సంగతి తెలిసిందే... దాదాపుగా 27 ఏళ్ల తరవాత ఈ చిత్రానికి సీక్వెల్‌ రాబోతుంది.. ప్రస్తుతం ఉన్న పరిస్థతుల దృష్ట్యా చిత్రాన్ని స్ట్రీమింగ్ ప్లాట్‌ఫాంలో విడుద‌ల చేయ‌నున్న‌ట్టు నిర్మాత ముకేష్ భ‌ట్ స్ప‌ష్టం చేశారు.

ఈ సందర్భంగా మహేష్ భట్ మాట్లాడుతూ.. సాధార‌ణ ప‌రిస్థితులు రావ‌డానికి కొంత సమయం పట్టేలా ఉంది.. దీనితో నా సినిమాని ఓటీటీలో విడుద‌ల చేయాల్సి వ‌స్తుంది. ఇది నాకున్న ఒకే ఒక ఆప్షన్ కూడా.. ఎవరి బలవంతం మాత్రం కాదు.. ప్రస్తుతం థియేట‌ర్స్ మూతపడ్డ క్రమంలో ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలన్న

ఉద్ధేశంతో రిలీజ్ చేస్తున్నట్టుగా మహేష్ భట్ వెల్లడించారు.. ఇక ఈ పరిస్థితులు కొన్ని రోజులు మాత్రమేనని మళ్లీ అన్ని సర్దుకుంటాయని ఆయన అన్నారు.

ఇక ఈ సినిమా లాగే జాన్వీ క‌పూర్ గుంజ‌న్ స‌క్సేనా: ద‌ఇ కార్గిల్ గ‌ర్ల్‌, విద్యా బాల‌న్ శకుంత దేవి బ‌యోపిక్‌, సుశాంత్ సింగ్ న‌టించిన దిల్ బెచారా చిత్రాలు ఓటీటీలో రిలీజ్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories