ఓటీటీలో రిలీజ్ కు బాలీవుడ్ చిత్రాలు క్యూ.. అమెజాన్ లో అమితాబ్ 'గులాబో సితాబో' మూవీ

ఓటీటీలో రిలీజ్ కు బాలీవుడ్ చిత్రాలు క్యూ.. అమెజాన్ లో అమితాబ్ గులాబో సితాబో మూవీ
x
Highlights

కరోనా వైరస్ వ్యాప్తితో అన్ని రంగాలు కుదేలైయ్యాయి. సినిమా షూటింగులు ఆగిపోయాయి. థియేటర్స్ అన్ని మూతపడ్డాయి. మళ్లీ ఎప్పటికీ తెరుచుకుంటాయి తెలియని పరిస్థితి. దీంతో నిర్మాతలు థియేటర్లకు ప్రత్యామ్నాయంగా ఓటీటీ ప్లాట్ ఫాం వైపు దృష్టి పెట్టారు.

కరోనా వైరస్ వ్యాప్తితో అన్ని రంగాలు కుదేలైయ్యాయి. సినిమా షూటింగులు ఆగిపోయాయి. థియేటర్స్ అన్ని మూతపడ్డాయి. మళ్లీ ఎప్పటికీ తెరుచుకుంటాయి తెలియని పరిస్థితి. దీంతో నిర్మాతలు థియేటర్లకు ప్రత్యామ్నాయంగా ఓటీటీ ప్లాట్ ఫాం వైపు దృష్టి పెట్టారు. సినిమాల ప్రదర్శన విషయంలో ఓటీటీ కూడా సవాల్ విసురుతోంది. అమెజాన్ ప్రైమ్, నెట్ ఫ్లిక్స్ వంటి ఓటీటీ ప్లేయర్స్ భారీ రేటుని ఆఫర్ చేస్తూ.. పలు సినిమాల ప్రదర్శన హక్కులను చేజిక్కించుకుంటున్నాయి. థియేటర్లు మూతబడడంతో ఓటీటీకి మరింత ప్రాధాన్యం పెరిగింది. నిర్మాతలు థియేటర్ల కోసం ఎదురుచూడకుండా వీటితో డీల్ కుదుర్చుకుంటున్నారు.

నిర్మాతలకు సినిమా జయాపజయాలతో పనిలేదు. ఇది టెన్షన్ ఫ్రీ. ముందుగానే భారీ లాభాలు కళ్లజూస్తున్నారు. ముఖ్యంగా బాలీవుడ్ నిర్మాతలు పలువురు అటువైపు దృష్టి సారిస్తున్నారు. ఇటీవలే అమితాబ్ నటించిన 'గులాబో సితాబో' చిత్రాన్ని అలాగే మంచి లాభాలకు అమెజాన్ కి అమ్మడం, అది విడుదల కావడం కూడా జరిగిపోయింది.

ఇక ఇదే కోవలో కరణ్ జొహార్ నిర్మించిన 'గుంజన్ సక్సేనా.. ది కార్గిల్ గాళ్' కూడా ఓటీటీ ద్వారా త్వరలో విడుదల కానుంది. అతిలోక సుందరి శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటించిన ఈ చిత్రానికి నెట్ ఫ్లిక్స్ సంస్థ 70 కోట్లను ఆఫర్ చేసి రిలీజ్ హక్కులను సొంతం చేసుకున్నట్టు బాలీవుడ్ సమాచారం. కాగా 30 కోట్ల బడ్జెట్టుతో తీసిన ఈ సినిమాకి ఇంతటి రేటు రావడంతో భారీ రేటు రావడం విశేషం. దీంతో పలువురు నిర్మాతలు ఈ ఓటీటీ ప్లాట్ ఫాంకు బాగా ఆకర్షితులవుతున్నారు. ఈ విధంగా బాలీవుడ్ చిత్రాలు వరుసగా ఓటీటీ ల వైపు క్యు కడుతున్నాయి.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories