సుశాంత్ ఆత్మహత్యపై డైరెక్టర్ శేఖర్ కపూర్ సంచలన వ్యాఖ్యలు
Sekhar Kapoor (File Photo)
సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యపై అనుమానాలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్ సంచలన వ్యాఖ్యలు చేసిన తర్వాత.. డైరెక్టర్ శేఖర్ కపూర్ ఆసక్తికరమైన ట్వీట్లతో కలకలం రేపారు. సుశాంత్ ఆత్మహత్యకు ఎవరు కారణమో తనకు తెలుసంటూ బాంబ్ పేల్చారు. ఇండస్ట్రీలో సుశాంత్ ఎదుగుదలను కొందరు అడ్డుకున్నారని.. బాలీవుడ్ పెద్దల నిర్ణయాలే.. ఆత్మహత్యకు దారి తీశాయంటూ ట్వీట్లో పేర్కొన్నారు.
పానీ సినిమా కోసం తామిద్దరం కలిసి పనిచేసే అవకాశం ఉన్నా.. యశ్‌రాజ్ సంస్థ వెనక్కి తగ్గడంతో.. ప్రాజెక్ట్ ఆగిపోయిందని.. అప్పుడు తన భుజాలపై సుశాంత్ కన్నీరుపెట్టుకున్న విషయాన్ని ట్వీట్లో చెప్పుకొచ్చారు.
Next Story




