రొమాంటిక్ లుక్స్ తో సాహో తాజా పోస్టర్

రొమాంటిక్ లుక్స్ తో సాహో తాజా పోస్టర్
x
Highlights

బాహుబలి తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్. ఇంత వరకూ ఈ...

బాహుబలి తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న తాజా చిత్రం సాహో. అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రద్ధ కపూర్ హీరోయిన్. ఇంత వరకూ ఈ సినిమాకి సంబంధించి ప్రభాస్ ఫొటోలతో కూడిన పోస్టర్ లు విడుదలయ్యాయి. కనీ, ప్రభాస్, శ్రద్ధా కపూర్ కల్సి ఉన్న పోస్టర్ ఒక్కటి కూడా విడుదల చేయలేదు. ఈరోజు తొలిసారిగా వీరిద్దరూ కలసి ఉన్న పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది.

రొమాంటిక్ లుక్స్ లో ప్రభాస్..శ్రద్ధా ఒకరినొకరు మురిపెంగా చూసుకున్తున్నట్టున్న ఈ పోస్టర్ అభిమానులను ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకి సుజిత్ దర్శకత్వం వహిస్తున్నారు. నీల్ నితిన్ ముఖేష్ విలన్ గా నటిస్తున్నారు. దాదాపు 300 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమా రూపొందిస్తున్నట్టు వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా ట్రైలర్, టీజర్ లకు మంచి స్పందన వచ్చింది. ఈసినిమా షూటింగ్ పూర్తయింది. కాగా, పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుపుకుంటోంది. ఆగస్ట్ 15న సాహో విడుదల కావాల్సి ఉండగా, గ్రాఫిక్ వర్క్స్ పూర్తి కాని కారణంగా సినిమాని ఆగస్ట్ 30 న విడుదల చేయనున్నట్టు చిత్రబృందం ప్రకటించింది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories