మూడొందల కోట్లు దాటిన సాహో!

మూడొందల కోట్లు దాటిన సాహో!
x
Highlights

రెబల్ స్టార్ ప్రభాస్ సాహో సినిమా ప్రపంచవ్యాప్తంగా రికార్డ్ కలెక్షన్లు సృష్టిస్తోంది. నాలుగు రోజుల్లోనే 330 కోట్ల గ్రాస్ కలెక్షన్లు రాబట్టిందీ సినిమా.

ఒకపక్క నెగెటివ్ టాక్.. మరోపక్క విమర్శల జల్లులు.. వీటన్నిటినీ తట్టుకుని కోట్లు కొల్లగొట్టింది ప్రభాస్ సినిమా సాహో. నాలుగు రోజుల్లో అక్షరాలా 330 కోట్లు సాధించింది ఈ సినిమా. ఇవి మామూలు కలెక్షన్లు కావు. ఎందుకంటే, బాహుబలి తో పోలుస్తూ వచ్చిన సినిమా ఇది. బాహుబలికి ముందు ఏ సినిమాతోనూ పోలిక లేదు. కానీ, సాహోకి ఆ సినిమాతో పోల్చుకునే పరిస్థితి. మొదటి రోజే మిశ్రమ స్పందన. ముఖ్యంగా బాలీవుడ్ లో విపరీతంగా వ్యతిరేక రివ్యూలు వచ్చాయి. వాటన్నిటినీ ఒక్క ప్రభాస్ ఇమేజి తుడిచిపెట్టేసింది. నాలుగు రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 330 కోట్లు రాబట్టిందని యూవీ క్రియేషన్స్ ట్విట్టర్ లో ప్రకటించింది.

రూ.350 కోట్ల భారీ బడ్జెట్‌తో ఇండియాస్ బిగ్గెస్ట్ యాక్షన్ మూవీగా తెరకెక్కిన 'సాహో'.. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రభాస్ క్రేజ్.. సినిమాకి చేసిన పబ్లిసిటీ.. వంటి వాటితో సాహోకి మొదటిరోజైన శుక్రవారం130 కోట్లకు పైగా రికార్డు కలెక్షన్లు వచ్చాయి. శనివారం కొంత తగ్గినప్పటికీ.. 75 కోట్లు వసూలు చేసింది సాహో. ఈ వసూలు చిన్నదేమీ కాదు. ఇకపోతే మూడోరోజు ఆదివారం కొంత పుంజుకుని 89 కోట్లు వసూలు చేసింది. అయితే, నాలుగోరోజు మాత్రం బాగా కలెక్షన్లు తగ్గిపోయాయి. కేవలం 36 కోట్లు మాత్రమె సాధించింది సాహో. వినాయకచవితి పండగ ప్రభావం సినిమా పై పడింది. ఇవన్నీ గ్రాస్ కలెక్షన్లు.

ఇక ఈ సినిమా బాలీవుడ్ లో వంద కోట్ల మైలురాయిని అందుకుని రికార్డు సృష్టించింది. ప్రభాస్ వరుసగా రెండో సినిమాతో వందకోట్ల వసూళ్లు రాబట్టిన హీరోగా బాలీవుడ్ లో చరిత్ర సృష్టించాడు. మొత్తమ్మీద వ్యతిరేకతలోనూ సొమ్ములు రాబడుతూ నా పేరే ఓ బ్రాండ్ అని నిరూపిస్తున్నాడు ప్రభాస్.

ఇక ఈ సినిమాని ప్రపంచవ్యాప్తంగా 277 కోట్లకు విక్రయించినట్టు సమాచారం. ఇప్పటివరకూ వచ్చిన కలెక్షన్లలో దిస్త్రిబ్యుటర్ల వాటా 165 కోట్లు గా చెబుతున్నారు. అంటే ఇంకా 112 కోట్లు వారికి రావాల్సి ఉంది. లాంగ్ రన్ లో ఈ సొమ్ము రాబట్టవచ్చని పరిశీలకులు భావిస్తున్నారు. మొత్తమ్మీద ఈ కలెక్షన్లు చూస్తుంటే ప్రభాస్ స్థాయి ఏమిటో తెలిసిపోతోందని అభిమానులు సంబరపడిపోతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories