సాహో సత్తా! రెండు రోజుల్లో 200 కోట్లు!

సాహో సత్తా! రెండు రోజుల్లో 200 కోట్లు!
x
Highlights

ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన.. విమర్శకుల దాడి.. అన్నిటినీ తట్టుకుని ప్రభాస్ సాహో గా తన సత్తా చాటాడు. రెండోరోజు కూడా కలెక్షన్ల సునామీ సృష్టించాడు. దీంతో రెండు రోజుల్లో 205 కోట్లు సాధించింది సాహో.

బాహుబలి తరువాత యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా ప్రపంచస్థాయి సినిమాగా ప్రజల ముందుకు వచ్చింది సాహో. విడుదలైన వెంటనే ఈ సినిమాకి మిశ్రమ స్పందన వచ్చింది. కొన్ని ప్రాంతాల్లో సినిమాకి మంచి స్పందన రాగా, కొన్ని ప్రాంతాల్లో ఎవరేజ్ టాక్ వచ్చింది. మొత్తమ్మీద హిట్టూ, ఫట్టూ లెక్కలు తెలేపరిస్థితి కనిపించలేదు. కానీ, ఈ సినిమా రెండు రోజుల్లో 205 కోట్లు ప్రపంచవ్యాప్తంగా రాబట్టింది. ఇది హీరోగా ప్రభాస్ సత్తాను నిరూపిస్తోంది. ఇప్పటివరకూ తెలుగు చిత్ర పరిశ్రమలోని ఏ హీరోకూ ఇంత భారీ ఓపెనింగ్స్ రాలేదు. ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా వెల్లడించింది.

మొదటి రోజు వరల్డ్ వైడ్ ప్రీమియర్స్ ద్వారా 130 కోట్లు సాధించిన సాహో రెండో రోజు 75 కోట్లు రాబట్టి రికార్డు క్రియేట్ చేసింది.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories