Road named as sushant singh rajput: బీహార్‌లోని ర‌హ‌దారికి బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పేరు!

Road named after sushant singh rajput: బాలీవుడ్ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా ముంబై పోలీసులు నిర్ధారించారు

Krishna
Published on: 11 July 2020 4:01 PM IST
Road named as sushant singh rajput: బీహార్‌లోని ర‌హ‌దారికి బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ పేరు!
X
SUSHANTH SINGH

Road named after Sushant Singh Rajput: బాలీవుడ్ సంచలనం సుశాంత్ సింగ్ రాజ్ పుత్ గత నెల 14న తన ఇంట్లో ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్లిన సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నట్లుగా ముంబై పోలీసులు నిర్ధారించారు.. అయితే అతని ఆత్మహత్యను ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు.. ఫ్యూచర్ స్టార్ గా మంచి భవిష్యత్ ఉన్న సుశాంత్ జీవితం ఇలా అర్ధాంతరంగా ముగిసిపోవడం అందరినీ కలవరపరిచింది.

ఈ క్రమంలో సుశాంత్ లాంటి మంచి మనసున్న వ్య‌క్తి మ‌న మ‌ధ్య లేక‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం అంటూ ఆయ‌న జ్ఞాప‌కంగా బీహార్‌లోని పర్నియాలో ఓ ర‌హ‌దారికి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ పేరు పెట్టుకున్నారు.. ఈ విషయాన్ని అక్కడి మేయర్ సరితా దేవి వెల్లడించారు.. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. మధుబని నుంచి మాతా చౌక్‌కు వెళ్లే రహదారికి సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చౌక్ అని నామ‌క‌ర‌ణం చేయడం .. ఇలా వీధికి ఆయ‌న పేరు పెట్ట‌డం ఘ‌న నివాళి అర్పించ‌న‌ట్లు అవుతుంద‌ని ఆమె పేర్కొన్నారు.. ఇక సుశాంత్ కి బీహార్ లో ఎక్కువ సంఖ్యలో అభిమానులు ఉన్నారు.

గత కొన్ని రోజుల ముందు అమెరికాలో ఉండే ర‌క్ష అనే సుశాంత్ అభిమాని ఒకరు ఖ‌గోళ శాస్త్ర సంస్థ నుండి ఓ న‌క్ష‌త్రాన్ని కొనుగోలు చేసి దానికి సుశాంత్ అనే పేరు పెట్టారు. దీనికి సంబంధించిన రిజిస్ట్రేష‌న్ కాపీని కూడా సోష‌ల్ మీడియాలో పోస్ట్ చేశారు..

ఇక సుశాంత్ చివరగా నటించిన 'దిల్ బేచారా' (Dil Bechara) సినిమాని త్వరలో అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు..వచ్చే నెల 24న ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar) లో విడుదల చేయనున్నారు.. ఈ సినిమాను ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తున్నారు. హాలీవుడ్ లో వచ్చిన 'ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్'కు ఈ సినిమా రీమేక్ గా తీశారు. సంజనా సాంఘీ ఈ సినిమాలో సుశాంత్ హీరోయిన్ గా నటించింది. ముఖేశ్ చాబ్రా తొలిసారిగా దర్శకత్వం వహించారు.. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది.

Krishna

Krishna

Next Story