Sushant Singh Rajput Last Movie: త్వరలో హాట్ స్టార్ లో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ చివరి చిత్రం .. అందరూ ఫ్రీగా చూడొచ్చు..

Sushant Singh Rajput Last Movie: బాలీవుడ్ సంచలనం సుశాంత్ రాజ్ పుత్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే..

Krishna
Updated on: 26 Jun 2020 12:45 PM IST
Sushant Singh Rajput Last Movie: త్వరలో హాట్ స్టార్ లో సుశాంత్ సింగ్ రాజ్ ఫుత్ చివరి చిత్రం .. అందరూ ఫ్రీగా చూడొచ్చు..
X

Sushant Singh Rajput last Film: బాలీవుడ్ సంచలనం సుశాంత్ రాజ్ పుత్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే.. కెరీర్ పిక్స్ లో ఉన్న టైంలో సుశాంత్ ఆత్మహత్య చేసుకోవడం అందర్నీ కలవరపరిచింది.. అయితే సుశాంత్ చివరగా నటించిన 'దిల్ బేచారా' (Dil Bechara) సినిమాని త్వరలో అభిమానుల ముందుకు తీసుకొచ్చేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు..వచ్చే నెల 24న ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్(Disney Plus Hotstar) లో విడుదల చేయనున్నారు.. ఈ సినిమాను ఫ్రీగా చూసే అవకాశం కల్పిస్తున్నారు.

ఇది సుశాంత్ చివరి చిత్రం కావడంతో అభిమానులతో పాటుగా బాలీవుడ్ మొత్తం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తోంది.. ముందుగా అనుకున్న టైమ్ ప్రకారం చూస్తే ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సి ఉంది కానీ కరోనా కారణంగా సినిమా విడుదల వాయిదా పడింది.. హాలీవుడ్ లో వచ్చిన 'ద ఫాల్ట్ ఇన్ అవర్ స్టార్స్'కు ఈ సినిమా రీమేక్ గా తీశారు. సంజనా సాంఘీ ఈ సినిమాలో సుశాంత్ హీరోయిన్ గా నటించింది. ముఖేశ్ చాబ్రా తొలిసారిగా దర్శకత్వం వహించారు.. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించాడు.

ఈ సంద్భంగా దర్శకుడు ముఖేష్ చాబ్రా మాట్లాడుతూ.. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ తనకి ఎప్పటి నుంచో తెలుసునని, మేమిద్దరం సినిమా చేయాలని ఎప్పటినుంచో కలలు కన్నమని కానీ .. ఇప్పుడు సుశాంత్ నన్ను వదిలేసి ఒంటరిగా వెళ్లిపోగా, తాను ఒంటరిగా సినిమాను విడుదల చేస్తున్నానని భావోద్వేగానికి లోనయ్యాడు.. ఈ సినిమా ప్రతి ఒక్కరినీ ఆకట్టుకుంటుందని ముఖేష్ చాబ్రా వెల్లడించారు..

సుశాంత్ చివరి చిత్రాన్ని థియేటర్ లో విడుదల చేయాలని ఫ్యాన్స్ కోరారు కానీ ప్రస్తుత పరిస్థితుల్లో నిర్మాతలు ఓటీటీలోనే విడుదల చేసేందుకు నిర్ణయించుకున్నారు.

ఇక ప్రేమ, ఆశ, అంతులేని జ్ఞాపకాల సమాహారమే ఈ చిత్రమని డిస్నీ ప్లస్, హాట్ స్టార్ వెల్లడించింది. ప్రతి ఒక్కరూ ఉచ్చితంగా ఈ సినిమాని వీక్షించవచ్చునని డిస్నీ ప్లస్, హాట్ స్టార్ చెప్పుకొచ్చింది..

ఇక సుశాంత్ సింగ్ రాజ్ పుత్ స్టార్ ప్లస్ లో ప్రసారం అయిన ఓ సీరియల్ ద్వారా బుల్లితెరకు పరిచయం అయ్యాడు.. అక్కడి నుంచి తన కెరీర్ ని మొదలుపెట్టిన సుశాంత్ మళ్లీ వెనుదిరిగి చూసుకోలేదు.. ఇక సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చి మరింతగా పాపులర్ అయ్యాడు.. శుద్ధ్ దేశీ రొమాన్స్, ఎంఎస్ ధోని, కేదారనాథ్, చిచ్చోరె సినిమాల్లో నటించి మెప్పించారు. కెరీర్ మంచి ఊపు మీద ఉన్న సమయంలో సుశాంత్ అందరినీ షాక్ కి గురి చేస్తూ ఆత్మహత్య చేసుకొని తిరిగిరాని లోకాలకు వెళ్లపోయాడు..

Krishna

Krishna

Next Story