Rhea Chakraborty's lawyer : న్యాయం ఓడిపోయింది.. రియా చక్రవర్తి లాయర్

Rhea Chakraborty’s lawyer : బాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో భాగంగా రియా చక్రవర్తి అరెస్ట్ కావడంతో ఆమె లాయర్ తీవ్రంగా స్పందించారు..

Krishna
Published on: 8 Sept 2020 5:37 PM IST
Rhea Chakrabortys lawyer : న్యాయం ఓడిపోయింది.. రియా చక్రవర్తి  లాయర్
X

rhea chakraborty

Rhea Chakraborty's lawyer : బాలీవుడ్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసులో భాగంగా రియా చక్రవర్తి అరెస్ట్ కావడంతో ఆమె లాయర్ తీవ్రంగా స్పందించారు.." న్యాయం ఓడిపోయింది.. డిఫ్రెషన్ తో బాధపడుతూ.. అక్రమంగా మందులు డ్రగ్స్ తీసుకొని ఆత్మహత్య చేసుకున్న ఓ వ్యక్తిని రియా ప్రేమించింది. ఈ కారణంగానే ఓ మహిళ అని చూడకుండా మూడు కేంద్ర సంస్థల పేరుతో ఆమెను వెంటాడాయి" అని విమర్శించారు. ఇక డ్రగ్స్ విషయంలో రియా నుంచి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) కీలక విషయాలను రాబట్టింది..

ఇక అంతకుముందు గత మూడు రోజుల నుంచి రియా చక్రవర్తిని విచారిస్తున్న నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో డ్రగ్స్ కేసులో ఆమెను అరెస్ట్ చేస్తున్నట్టుగా కొద్దిసేపటి క్రితం వెల్లడించింది.. ఎన్‌డీపీఎస్‌లో వివిధ సెక్షన్ల కింద ఆమెను అరెస్టు చేసిన‌ట్లు తెలుస్తోంది. అయితే ఆమె తమ్ముడు షోవీక్ ఇచ్చిన వివరాలు ఈ కేసులో కీలకంగా మారాయి.. రియా సూచనల మేరకే సుశాంత్ డ్రగ్స్ తీసుకునేవాడని విచారణలో షోవీక్ చెప్పడంతో ఆ కోణంలో ఎన్ సీబీ విచారణ చెప్పట్టి వివరాలను రాబట్టింది.. ఆమె నుంచి ల్యాప్ టాప్, మొబైల్ లను స్వాధీనం చేసుకొని ఆధారాలను సేకరించింది. ఇక ఇప్పటికే ఈ కేసులో ప‌లువురిని అరెస్టు చేశారు. అందులో రియా చక్రవర్తి సోద‌రుడు షోవీక్ తో పాటు సుశాంత్ ఇంటి మేనేజ‌ర్ సామ్యూల్ కూడా ఉన్నారు. అటు విచారణలో రియా 25 మంది బాలీవుడ్ ప్రముఖుల పేర్లు చెప్పినట్టు సమాచారం..


Krishna

Krishna

Next Story