RGV Tweet: విరాట్ కోహ్లిని పొగుడుతూ వర్మ ట్వీట్

Sandeep Reddy
Updated on: 25 Oct 2021 12:00 PM IST
RGV Tweet on Virat Kohli About The T20 World Cup 2021 India vs Pakistan Match Yesterday 24 10 2021
X

RGV Tweet: విరాట్ కోహ్లిని పొగుడుతూ వర్మ ట్వీట్

RGV Tweet: ప్రముఖ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక విషయంపై తనదైన శైలిలో వ్యంగ్యంగా స్పందిస్తుంటాడు. తనకి నచ్చిన వ్యక్తులను ఆకాశానికెత్తుతూ, నచ్చని వ్యక్తులపై వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటాడు. తాజాగా భారత్ - పాకిస్థాన్‌ క్రికెట్‌ మ్యాచ్‌పై కూడా ఆర్జీవీ స్పందించాడు.

మ్యాచ్ అనంతరం రామ్‌ గోపాల్‌ వర్మ తన ట్విట్టర్ ఖాతాలో మ్యాచ్ కి సంబంధించి ఒక ట్వీట్ చేశాడు. 'విరాట్‌ కోహ్లీ నువ్వు మ్యాచ్‌లో నిజమైన క్రీడాస్ఫూర్తిని ప్రదర్శించావు. ఎలాంటి అహంభావానికి పోకుండా ప్రత్యర్థుల విజయాన్ని ప్రశంసించావు. అందుకు నీకు వందనాలు' అంటూ ట్విట్టర్‌ వేదికగా విరాట్‌ కోహ్లీని ఆర్జీవీ ప్రశంసించాడు.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ దిగిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 151 పరుగులు చేసింది. పాకిస్థాన్ బౌలర్లలో షాహిన్ షా అఫ్రిది మూడు వికెట్లు తీయగా హసన్ అలీ, షాదాబ్ ఖాన్, హ్యారిస్ రౌఫ్ చెరొక వికెట్ తీశారు. ఆ తరువాత బ్యాటింగ్ కి దిగిన పాకిస్తాన్ జట్టు 17.5 ఓవర్లలోనే వికెట్ నష్టపోకుండా 152 పరుగుల లక్ష్యాన్ని చేధించి ఘనవిజయాన్ని సాధించింది.


Sandeep Reddy

Sandeep Reddy

Next Story