RGV Power star: రాంగోపాల్ వర్మ టాలీవుడ్ కు కొరకరాని కొయ్య అవుతున్నాడా?

RGV Power star: రాంగోపాల్ వర్మ టాలీవుడ్ కు కొరకరాని కొయ్య అవుతున్నాడా?
x
Highlights

రాంగోపాల్ వర్మ సెన్షెనల్ కామెంట్లకు, సెటైరికల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. కానీ ఇప్పుడు టాలీవుడ్ కు కొరకరాని కొయ్య అవుతున్నాడా? అనవసర విషయాల్లో తల...

రాంగోపాల్ వర్మ సెన్షెనల్ కామెంట్లకు, సెటైరికల్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్.. కానీ ఇప్పుడు టాలీవుడ్ కు కొరకరాని కొయ్య అవుతున్నాడా? అనవసర విషయాల్లో తల దూర్చుతున్నాడా? బయోపిక్ ల పేరుతో సినీ రాజకీయ నాయకులతో కయ్యానికి కాలు దువుతున్నాడా? తనపై దాడిని కూడా క్యాష్ చేసుకుంటున్న వర్మ ఇక అందరికీ టార్గెట్ అవ్వబోతున్నాడా? అంటే జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి.

ఆర్జీవీ.. ఆయనో వింత జీవి.. ఎవరి మాట వినడు. తన బుర్రకు ఏది నచ్చితే అది చేసుకుంటూ పోతుంటాడు. సినీ, రాజకీయ అనే తేడా లేదు. రౌడీలు, డాన్ లన్న భయం అంతకన్నా లేదు. ఎంత పెద్ద వాళ్లనైనా రెచ్చగొట్టేలా మంటలు పెట్టి చలి కాచుకుంటాడు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు వర్మ తీరే అంతా. రాంగోపాల్ వర్మ సమకాలిక అంశాలను క్యాష్ చేసుకోవడంలో దిట్ట. అది ఎంతలా అంటే కరోనా కాలాన్ని కూడా ఆర్జీవీ క్యాష్ చేసుకున్నాడు. వరుస బెట్టి క్లెమాక్స్ , న్యాకుడ్ నగ్నం, పవర్ స్టార్, సినిమాలు చేసి సోషల్ మీడియాల్లో రిలీజ్ చేశాడు. ఇంకా దిశా, మర్డర్ గేర్, కరోనా వైరస్ లాంటి సినిమాలు రిలీజ్ కు సిద్ధంగా ఉన్నాయంటే వర్మ టాలెంట్ ఏంటో అర్థం చేసుకోవచ్చు.

వర్మ ఇప్పటి వరకు తీసిన సినిమాలన్నీ సమాజంలో ప్రభావితం చేసే వ్యక్తుల జీవిత కథలనే బయోపిక్ రూపంలో తీసి చూపించాడు. రక్తచరిత్ర నుంచి పవర్ స్టార్ వరకు అన్ని సినిమాలకు ప్రముఖుల జీవితకథలనే స్క్రిప్ట్ గా రాసుకున్నాడు. రాంగోపాల్ వర్మ అందరి గురించి సినిమాలు తీయడం ఇప్పుడు టాలీవుడ్ లో పెద్ద చర్చకు దారి తీస్తోంది. అది ఎంత లా అంటే వర్మను పర్మినెంట్ గా బ్యాన్ చేయాలనే అంతలా. వర్మ టాలీవుడ్ కు పట్టిన కర్మగా భావిస్తున్నారు కొందరు. పైకి మాత్రం సైలెంట్ గా ఉంటున్నా లోపల తమ కార్యకలాపాలు సాగిస్తున్నారు. అందుకే ఇప్పటి వరకు అందరినీ టార్గెట్ చేసిన వర్మ ఇక అందరికీ టార్గెట్ అయ్యాడంటున్నారు.

వర్మ ఇప్పటి వరకు అందరి జీవితాలను సినిమాగా మలిస్తే ఇప్పుడు వర్మపై సినిమాలు తీయడం మొదలు పెట్టారు. ప్రముఖ కవి జోన్నవిత్తుల దగ్గర నుంచి షకలక శంకర్, నూతన్ నాయుడు వరకు వరుసగా వర్మ పై సెటైరికలుగా సినిమాలు నిర్మిస్తున్నారు. షకలక శంకర్ డేరా బాబాగా వెబ్ సిరీస్ తీస్తుంటే, నూతన్ నాయుడు పరాన్నాజీవి అంటూ ఓ సినిమా స్టార్ట్ చేశాడు, ఇక జోన్నవిత్తుల ఆర్జీవీపై గతంలో బాగా ఫైర్ అయ్యాడు. నిఖిల్ లాంటి హీరోలు వర్మను కుక్కతో పోల్చారు. ఇటు సినిమా పరంగానే కాదు. అటు పొలిటికల్ పరంగాను వర్మ టార్గెట్ కాబోతున్నాడని తెలుస్తోంది. వర్మ పై వచ్చే సినిమాలకు కొంత మంది టీడీపీ నాయకులు నిర్మాతలుగా వ్యవహరించబోతున్నట్లు తెలుస్తోంది.

Show Full Article
Print Article
Next Story
More Stories