Powerstar vs paranna jeevi రామ్ గోపాల్ వర్మ ఎవరో తెలీదు అంటున్న 'పరాన్నజీవి' దర్శకుడు!

Nutan naidu fires on RGV
x
Nutan naidu and shakalaka shankar with HMTV 9 pm with roja
Highlights

Powerstar vs paranna jeevi

రామ్ గోపాల్ వర్మ ఎవరో నాకు తెలీదు..కానీ, కచ్చితంగా ఆర్జీవీపై మా ప్రతిదాడే ఇది.. అంటూ pavan కళ్యాణ్ వీరాభిమాని..పరాన్నజీవి దర్శకుడు నూతన్ నాయుడు స్పష్టం చేశారు.

దాడికి ప్రతి దాడి.. కత్తికి కత్తి.. పన్నుకు పన్ను.. ఇవన్నీ ఇంత వరకూ కథల్లో చూశాం..ఇపుడు సినిమాల నిర్మాణం విషయంలోనూ ఈ సంప్రదాయం పురుడు పోసుకుంది. ఎవర్నీ లెక్కచేయని.. అంతా నా ఇష్టం అంటూ చెప్పుకునే దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఒక వైపు.. మా దేవుడిని ఏమైనా అంటే ఊరుకోం అంటూ ఉరికే పవన్ కళ్యాణ్ అభిమానులు మరోవైపు ఇప్పుడు బుల్లితెర క్షేత్రంగా యుద్ధం మొదలు పెట్టారు. ఆర్జీవీ అన్నీ తానై పవర్ స్టార్ అనే సినిమాని వదులుతుంటే.. కేవలం నాలుగురోజుల్లో ఆ సినిమాకి కౌంటర్ గా పవన్ అభిమానులు నూతన్ నాయుడు సారధ్యంలో పరాన్నజీవి పేరుతొ సినిమా తీసేశారు. మరికొద్ది గంటల్లో (జూలై 25 ఉదయం 11 గంటలకు) రెండు సినిమాలు విడుదల కానున్నాయి.

విమర్శలు..ప్రతి విమర్శలతో సోషల్ మీడియాను హోరెత్తించే ఆర్జీవీ..పవన్ కళ్యాణ్ అభిమానులు చెరో పక్షంగా సినిమాలు వదులుతుండడం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఈ నేపధ్యంలో పరాన్నజీవి దర్శకుడు నూతన్ నాయుడు HMTV తో ప్రత్యేకంగా మాట్లాడారు.

అర్జీవీ సినిమాలు వ్యక్తులు టార్గెట్ గా సినిమాలు తీసి ఇది కల్పిత కథ అని చెప్పడం చూస్తూ వస్తున్నాం. అయితే, ఇప్పుడు అదే ట్విస్ట్ నూతన్ నాయుడు ఇచ్చారు. ఇది ఆర్జీవీ అనే క్యారెక్టర్ లెస్ క్యారెక్టర్ సినిమా అని చెబుతూనే.. అర్జీవీని పోలిన వ్యక్తీ తో సినిమా వదులుతున్నారు. ఈ ఇంటర్వ్యూలో ఇంకా నూతన్ నాయుడు ఏమన్నారంటే..

ఇది రాధాగోపాల్ వర్మ అనే దర్శకుడు గురించి తీసిన సినిమా. ఇది క్యారెక్టర్ లెస్ డైరెక్టర్ సినిమా..ఎవరు వేషం కోసం వచ్చినా అన్నిరకాలుగాను వాడుకునే దర్శకుడి కథ ఇది. మేము వాస్తవాలే చెబుతాం. మేం నిజాన్నే నమ్ముతాం..పవనిజాన్ని నమ్ముతాం అంటూ చెప్పారు నూతన్ నాయుడు.

పవన్ కళ్యాణ్ అభిమానుల అభిమానం ముందు ఎవరైనా నిలబడలేరు. కుక్కతోక వంకర లాంటిది అర్జీవీ బుద్ధి అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. ఈ ఇంటర్వ్యూలో నూతన్ నాయుడు.. హీరోగా నటించిన షకలక శంకర్ ఏమన్నారో మీరూ చూడండి!


Show Full Article
Print Article
Next Story
More Stories