Ravi Teja: ప్రమోషన్ల కి దూరంగా ఉంటున్న రవితేజ

Ravi Teja: అందుకే "ఖిలాడీ" ప్రమోషన్స్ లో కనపడని రవితేజ

admin1
Updated on: 7 Feb 2022 2:30 PM IST
Ravi Teja Stays Away From Film Promotions
X

Ravi Teja: ప్రమోషన్ల కి దూరంగా ఉంటున్న రవితేజ

Ravi Teja: ఈ మధ్యకాలంలో సినిమా హిట్ అవ్వాలంటే ప్రమోషన్లు చాలా ముఖ్యం. రాజమౌళి వంటి డైరెక్టర్లు కూడా తమ సినిమాకి భారీ రేంజ్ లో ప్రమోషన్లు చేస్తారు. కానీ మాస్ మహారాజా రవితేజ మాత్రం తన తదుపరి సినిమా "ఖిలాడీ" విషయంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోకపోవడం అందరినీ షాక్ కి గురి చేస్తోంది. ఫిబ్రవరి 11 న విడుదల కావాల్సిన ఈ సినిమా ఫిబ్రవరి 18కి దర్శకనిర్మాతలు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. అయితే సినిమా విడుదలకు ఇంకా పట్టుమని పది రోజులు కూడా లేవు కానీ చిత్రబృందం మాత్రం ప్రమోషన్ల విషయంలో చాలా సైలెంట్ గా ఉంటుంది.

దీంతో అభిమానులు సైతం అసలు సినిమా విడుదల అవుతుందా లేదా అంటూ దర్శక నిర్మాతల పై ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం రవితేజ ప్రస్తుతం వరుస సినిమా షూటింగులతో బిజీగా ఉండటం వల్ల ఈ చిత్ర ప్రమోషన్ దృష్టి పెట్టలేకపోతున్నారట. అందువల్లే సినిమా ప్రమోషన్స్ లో రవితేజ పాల్గొనలేక పోతున్నారని తెలుస్తోంది. అయితే వరుస డిజాస్టర్లతో సతమతమైన రవితేజ ఈ మధ్యనే "క్రాక్" సినిమాతో సూపర్ హిట్ ని అందుకున్నారు. కాబట్టి "ఖిలాడీ" సినిమాపై కూడా మంచి అంచనాలు ఉన్నాయి. ఇలాంటి సమయంలో సినిమాని ప్రమోట్ చేస్తే సినిమాకి మరింత హైప్ పెరిగే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ విషయంలో రవితేజ ఏం చేస్తారో ఇంకా తెలియాల్సి ఉంది.

admin1

admin1

Next Story