Rashmika surprises to Mahesh babu family :సూపర్ స్టార్ భార్యకి సప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక మందాన్నా!

Rashmika surprises to Mahesh babu family: అందాల నటి రష్మిక మందన్నా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్యకి సప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.

Krishna
Updated on: 30 Jun 2020 8:27 PM IST
Rashmika surprises to Mahesh babu family :సూపర్ స్టార్ భార్యకి సప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన రష్మిక మందాన్నా!
X

Rashmika surprises to Mahesh babu family: అందాల నటి రష్మిక మందన్నా టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు భార్యకి సప్రైజ్ గిఫ్ట్ ఇచ్చింది.. మామిడికాయ ప‌చ్చ‌డికి కావ‌లిసిన ఐటెమ్స్ అన్ని ప్రత్యేకంగా ప్యాక్ చేసి డెలివ‌రీ చేసింది. ఈ విషయాన్ని నమ్రతా శిరోద్కర్ తన ఇన్ స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది.. దీనికిగాను నమ్రతా శిరోద్కర్ రష్మిక మందాన్నాకి ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసింది. కోవిడ్ స‌మ‌యంలో మాకు అందిన తొలి గిఫ్ట్ ఇదేనంటూ నమ్రత పేర్కొంది.. దీనికి బదులుగా రష్మిక స్పందిస్తూ ఇవి మీకు నచ్చుతాయని ఆశిస్తున్నానని పేర్కొంది.

రష్మిక మండన్నా, మహేష్ బాబు కలిసి సరిలేరు నీకెవ్వరు అనే సినిమాలో నటించిన సంగతి తెలిసిందే.. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది.. ఇక షూటింగ్ స‌మ‌యంలోను ర‌ష్మిక చిత్ర బృందంతో పాటుగా మహేష్ ఫ్యామిలీతో కలిసి చాలా అల్లరి చేసింది. ఈ సందర్భంలోనే మహేష్ కుటుంబానికి చాలా దగ్గరైంది రష్మిక.. ఇక ప్రస్తుతం రష్మీక అల్లు అర్జున్ హీరోగా, సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కుతున్న పుష్ప అనే సినిమాలో క‌థానాయిక‌గా నటిస్తోంది..

ఇక అటు మహేష్ బాబు ప్రస్తుతం గీతా గోవిందం ఫేం పరుశురాంతో సర్కారు వారి పాట అనే సినిమాని చేస్తున్నాడు. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇందులో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది..ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్, జి ఎం బి ఎంటర్టైన్మెంట్స్, 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్నాడు.

Krishna

Krishna

Next Story