Ram Gopal Varma: ఆర్జీవీ కిడ్నాప్.. ఓటీటీలో ఫిక్స్..?

Ram Gopal Varma: "ఆర్జీవీ మిస్సింగ్" అనే సినిమా పోస్ట‌ర్ ఒక‌టి రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే

Samba Siva Rao
Published on: 12 May 2021 3:29 PM IST
Ramgopal Varma RGV Missing Movie will be Releasing on Spark OTT
X

ఆర్జీవీ మిస్సింగ్ (పోస్టర్ )

Ram Gopal Varma: సంచ‌ల‌న ద‌ర్శ‌కుడు రామ్ గోపాల్ వ‌ర్మ నిత్యం ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. స‌మాజం జ‌రిగే ప్ర‌తి అంశాన్ని సినిమాగా తీస్తా అంటూ ప్ర‌క‌టన‌లు ఇస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకులపైన సినిమాలు చేస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటున్నారు. ఎప్పుడో ఏడాది క్రితం "ఆర్జీవీ మిస్సింగ్" అనే సినిమా పోస్ట‌ర్ ఒక‌టి రిలీజ్ చేసిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ సినిమాను ఓటీటీలొ విడుదల‌ చేయ‌నున్న‌ట్లు తెలుస్తోంది.

"ఆర్జీవీ మిస్సింగ్" ఈ మిస్సింగ్‌లో పవర్ ఫుల్ స్టార్ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాజీ ముఖ్యమంత్రి, పప్పు అని పిలవబడే ఆయన కుమారుడు అనుమానితులు అని పేర్కొన్నాడు. అంతేకాకుండా ప్రపంచంలోనే మొదటిసారిగా వస్తున్న ఫిక్షనల్ రియాలిటీ సినిమా అంటూ గ‌తంలో పేర్కొన్నాడు. ఈ సినిమాను రాము సొంత ఓటీటీ సంస్థ స్పార్క్ లో దీనిని విడుదల చేయ‌నున్నార‌ని స‌మాచారం.

గ‌తంలో విడుద‌ల చేసిన‌ ఫస్ట్ లుక్ లో వర్మ చేతులకి బేడీలు వేసుకొని ఇన్నోసెంట్ ఫేస్‌తో కనిపిస్తున్నాడు. ఇందులో ఆర్జీవీ తనకి తానే 'అమాయకమైన బాధితుడు' అని ప్రకటించుకోవడం మరో విశేషం. ఇక ఈ సినిమాని కేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చటర్జీ నిర్మిస్తుండగా అదిర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ లుక్ తోనే సినిమా పైన ఆసక్తిని పెంచాడు వర్మ.

స్పార్క్(SPARK) ఓటీటీ ద్వారా విడుద‌ల ఖాయంగా క‌నిపింస్తోంది. ఇంకా అధికారికంగా సినీయునిట్ ప్రకటించలేదు ఈ మూవీ ఒక్క‌టే కాదు, దిశ‌, క‌న‌బ‌డుట‌లేదు, ఇలా అనేక సినిమాలో క్యూలో ఉన్నాయి. రామ్ గోపాల్ వ‌ర్మ మిస్స్ంగ్ అనే సినిమాలో వర్మనే నటిస్తాడా లేకా మరెవరైనా నటిస్తారా అన్నది చూడాలి మరి. వ‌ర్మ స్పార్క్ ఓటీటీ సంస్థ ద్వారా మే15 లాంచ్ కానుంది. ఇందులో మాఫియా డాన్ దావూద్ ఇబ్ర‌హిం జీవిత చ‌రిత్ర ఆధారంగా రూపొందిన డి కంపెనీ సినిమా మే 15వ‌తేదీనే స్ట్రీమ్ కానుంది. సొంత‌గా ఓటీటీ సంస్థ‌ను స్థాపించిన వ‌ర్మ‌కు తెలుగు సినీన‌టులు, నిర్మాత‌లు శుభాకాంక్ష‌లు తెలిపారు. స్పార్క్ విజ‌యవంతం కావాల‌ని కోరుకున్నారు.


Samba Siva Rao

Samba Siva Rao

Next Story