ఆర్జీవీ మిస్సింగ్.. వర్మ చేతులకి బేడీలు.. కారణం ఎవరంటే?

RGV Missing Movie : నిత్యం ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుల పైన సినిమాలు చేస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటున్నారు వర్మ..

Krishna
Published on: 4 Oct 2020 10:50 AM IST
ఆర్జీవీ మిస్సింగ్.. వర్మ చేతులకి బేడీలు.. కారణం ఎవరంటే?
X

RGV Missing 

RGV Missing Movie : నిత్యం ఎవరో ఒకరిని టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ. ఈ మధ్యకాలంలో రాజకీయ నాయకుల పైన సినిమాలు చేస్తూ అందరి దృష్టిని తనవైపు తిప్పుకుంటున్నారు వర్మ.. అదే వర్మ స్పెషాలిటి కూడా.. లాక్ డౌన్ టైంలో అందరూ సినిమాలకి దూరంగా ఉంటే వర్మ మాత్రం వరుసపెట్టి సినిమాలను చేస్తున్నాడు. తాజాగా "ఆర్జీవీ మిస్సింగ్" అనే పేరుతో మరో సినిమాని చేస్తున్నాడు వర్మ..

అయితే ఇందులో పెద్దగా వివాదం ఏముంది అనుకోవచ్చు.. వర్మ ఎవరిని వదలడు కదా.. తాజాగా ఈ మూవీ ఫస్ట్‌లుక్ విడుదల చేస్తూ.. తానూ మిస్సైన ఘటనకు తెలియజేస్తూ.. ఈ మిస్సింగ్‌లో పవర్ ఫుల్ స్టార్ ఫ్యాన్స్, మెగా ఫ్యామిలీ, మాజీ ముఖ్యమంత్రి, పప్పు అని పిలవబడే ఆయన కుమారుడు అనుమానితులు అని పేర్కొన్నాడు. అంతేకాకుండా ప్రపంచంలోనే మొదటిసారిగా వస్తున్న ఫిక్షనల్ రియాలిటీ సినిమా అంటూ పేర్కొన్నాడు.

తాజాగా విడుదలైన ఫస్ట్ లుక్ లో వర్మ చేతులకి బేడీలు వేసుకొని ఇన్నోసెంట్ ఫేస్‌తో కనిపిస్తున్నాడు. ఇందులో ఆర్జీవీ తనకి తానే 'అమాయకమైన బాధితుడు' అని ప్రకటించుకోవడం మరో విశేషం. ఇక ఈ సినిమాకి సంబంధించిన రెండో లుక్ ని అక్టోబర్ 4వ తేదీ సాయంత్రం 5 గంటలకు రిలీజ్ చేస్తున్నట్టుగా వర్మ వెల్లడించాడు. అయితే ఈ సినిమాలో వర్మనే నటిస్తాడా లేకా మరెవరైనా నటిస్తారా అన్నది చూడాలి మరి. ఇక ఈ సినిమాని కేవీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చటర్జీ నిర్మిస్తుండగా అదిర్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. ఫస్ట్ లుక్ తోనే సినిమా పైన ఆసక్తిని పెంచాడు వర్మ..


Krishna

Krishna

Next Story