Ramgopal Varma About Pawan Kalyan: పవన్ కి కథ చెబితే లేచి వెళ్ళిపోయాడు : అర్జీవీ

Ramgopal Varma About Pawan Kalyan: సినిమాలతో వివాదాలు సృష్టించడంలో రామ్ గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా.. తాజాగా అయన పవర్ స్టార్ పేరుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే..

Krishna
Updated on: 23 July 2020 8:30 PM IST
Ramgopal Varma About Pawan Kalyan: పవన్ కి కథ చెబితే లేచి వెళ్ళిపోయాడు : అర్జీవీ
X
Pawan Kalyan and Ram Gopal Varma (File Photo)

Ramgopal Varma About Pawan Kalyan: సినిమాలతో వివాదాలు సృష్టించడంలో రామ్ గోపాల్ వర్మ తర్వాతే ఎవరైనా.. తాజాగా అయన పవర్ స్టార్ పేరుతో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. ఈ సినిమా ఎవరిని ఉద్దేశించి కాదు అంటూనే సినిమా టైటిల్ నుంచి పాత్రల వరకు అన్నింటిలో పవన్ కళ్యాణ్ కి సంబంధించిన విషయాలను తెర పైన చూపిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ.. ఇప్పటికే సినిమాకి సంబంధించిన ట్రైలర్ , ఓ పాటను విడుదల చేసి పెద్ద వివాదాన్నే సృష్టించాడు వర్మ..

తాజాగా అయన హెచ్ఎంటీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సినిమా గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారు. పవన్ కి నేను పెద్ద ఫ్యాన్ అన్నారు వర్మ.. పరసనల్ గా పవన్ కళ్యాణ్ అంటే చాలా అభిమానం అని అన్నారు. సినిమాలకి రాకముందే పవన్ తనకి తెలుసునని అన్నారు. అప్పట్లో ఓ సినిమా కోసం పవన్ కాంటాక్ట్ అయ్యానని , కానీ పవన్ చేయనన్నాడని చెప్పుకొచ్చాడు . ఇక జనసేన పార్టీ మొదలు పెట్టినప్పుడు ఇచ్చిన స్పీచ్ కి ఫిదా అయిపోయి పవన్ కళ్యాణ్ కి ఫోన్ చేసి మాట్లాడానని అన్నారు. నాకు పవన్ మీదా కానీ మెగా ఫ్యామిలీ కాదని ఎలాంటి కోపం లేదని అన్నారు.

ఇదో ఫిక్షన్ కథ.. నమ్మాల్సిందే!

ఇక పవర్ స్టార్ సినిమా గురించి మాట్లాడుతూ.. ఇది ట్రూత్ కాదని ఉహించి తీసిన సినిమా మాత్రమేనని అన్నారు. పార్టీ ఓడిపోయిన తర్వాత కొన్ని సన్నివేశాలను మాత్రం ఉహించి తీసానని, ఇది కేవలం ఫిక్షన్ కథ అంటూ చెప్పుకొచ్చారు. ఇది నిజం కచ్చితంగా నమ్మాలని అన్నారు వర్మ.. అంతేకాకుండా నిజం చెప్పడంలో సత్య హరిచంద్రుడు తర్వాత తానే అంటూ తనదైన శైలిలో చెప్పుకొచ్చారు వర్మ..

పరాన్నజీవి పై వర్మ స్పందన :

పవర్ స్టార్ టైటిల్ పెట్టి వర్మ సినిమా తీస్తుండడంతో అయన అభిమానులు వర్మ పైన పరాన్నజీవి అనే టైటిల్ తో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.. అయితే దీనిపైన వర్మ ఈ ఇంటర్వ్యూలో స్పందించాడు. అవును పరాన్నజీవి అని ఒప్పేసుకున్న వర్మ.. పరాన్నజీవి కానీ మనిషి ఎవరు ఉండరూ అంటూ చెప్పుకొచ్చాడు.

మరెన్ని వివాదాలో...

ఇక ఈ సినిమాని జూలై 25న అర్జీవీ వరల్డ్ ధియేటర్లో విడుదల చేస్తున్నాడు. ఇప్పటివరకు ట్రైలర్ , పాటతో పెద్ద వివాదాలు సృష్టించిన వర్మ ఇక సినిమాని విడుదల చేసి ఇంకెన్ని వివాదాలు సృష్టిస్తారో చూడాలి.


Krishna

Krishna

Next Story