RGV vs Pawan Fans: ఈ విజయం పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు అంకితం: వర్మ

RGV vs Pawan Fans: లాక్ డౌన్ సమయంలో మేకర్స్ అందరూ సినిమాలను పక్కన పెడితే వర్మ మాత్రం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు..

Krishna
Published on: 21 July 2020 8:14 PM IST
RGV vs Pawan Fans: ఈ విజయం పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు అంకితం: వర్మ
X
17 Lakhs views for Gaddi tintava song from power star movie

RGV vs Pawan Fans: లాక్ డౌన్ సమయంలో మేకర్స్ అందరూ సినిమాలను పక్కన పెడితే వర్మ మాత్రం వరుసపెట్టి సినిమాలు చేస్తున్నాడు.. ఇప్పటికే మియా మల్కోవాతో క్లైమాక్స్, కరోనా వైరస్, నగ్నం వంటి సినిమాలను విడుదల చేసిన వర్మ తాజాగా పవర్ స్టార్ అనే పేరుతో ఓ సినిమా చేయనున్నట్లు వర్మ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తే అది పెద్ద వివాదానికి దారీ తీసింది. ఇది చాలదు అన్నట్టుగా సినిమా నుంచి గడ్డి తింటవా అంటూ మొదటి పాటను విడుదల చేశాడు వర్మ..

అయితే ఈ పాట విడుదలైన కొద్ది సేపటికే భారీ రెస్పాన్స్ వచ్చింది. ఏకంగా ఈ పాటను 17 లక్షల మంది వీక్షించారని వర్మ తన ట్విటర్‌లో పేర్కొన్నారు. అయితే పాటకి ఇంత మంచి రెస్పాన్స్‌ రావడంపై ఆయన స్పందిస్తూ.. ఈ విజయం 'పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు అంకితం'అని ట్వీట్‌ చేశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతున్నట్లుగా వర్మ పేర్కొన్నాడు. ఇక సినిమాకి సంబంధించిన ట్రైలర్ ని రేపు (బుధవారం) ఉదయం 11 గంటలకి విడుదల చేస్తున్నట్టుగా వర్మ ప్రకటించాడు. అయితే ఈ సినిమా ట్రైలర్ చూడాలంటే రూ.25 చెల్లించాలని ఆర్జీవీ ఇదివరకే చెప్పిన సంగతి తెలిసిందే. ఇక సినిమాని జూలై 25న ఉద‌యం 11 గంట‌ల‌కు ఆర్జీవీ వ‌ర‌ల్డ్ థియేట‌ర్‌లో విడుదల చేయనున్నాడు వర్మ..

ఇక ఈ సినిమా ద్వారా ఓ కొత్త నటుడుని పరిచయం చేయబోతున్నాడు వర్మ.. ఆ నటుడికి అచ్చం పవన్ కళ్యాణ్ లాగే పోలికలు ఉండడంతో టిక్ టాక్ లో వీడియోలు చేస్తూ పాపులర్ అయ్యాడు.. ఈ వీడియోలు చూసి ఇతన్ని కాంటాక్ట్ అయ్యాడట వర్మ..అతన్ని ఆఫీక్ కి పిలిపించి కేవలం 10 రోజుల్లోనే షూటింగ్ కంప్లీట్ చేస్తా అని వర్మ చెప్పుకొచ్చారట. ఇక ఇప్పటికే టైటిల్ విషయంలో పెద్ద వివాదం సృష్టించిన వర్మ ఇక సినిమా తీసి ఇంకెన్ని వివాదాలు సృస్తిస్తాడో చూడాలి మరి.RGVvsPawan fans : ఈ విజయం పవన్‌ కల్యాణ్‌ అభిమానులకు అంకితం ; వర్మ

Krishna

Krishna

Next Story