Ram Gopal Varma : నాకు వోడ్కా.. మీకు విస్కీ.. సోషల్ మీడియాలో వర్మ పోస్ట్ వైరల్

* వరంగల్ మైసమ్మ టెంపుల్ ని సందర్శించిన రామ్ గోపాల్ వర్మ

Sandeep Reddy
Updated on: 12 Oct 2021 6:15 PM IST
Ram Gopal Varma Visits Warangal Maisamma Temple and Shared Photo in Twitter
X

రామ్ గోపాల్ వర్మ  (ట్విట్టర్ ఫోటో) 

Ram Gopal Varma: రామ్ గోపాల్ వర్మ.. ఒకప్పుడు సినిమా పరిశ్రమకి దొరికిన ఆణిముత్యం అని అనుకున్న.. ఆ ఆణిముత్యం కాస్త పిచ్చి పిచ్చి కామెంట్స్ తో సోషల్ మీడియాలోనే కాకుండా ఒక కథాకథనం లేని సినిమాలు తీస్తూ జాతిరత్నంగా మిగిలిపోయిందని నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. ఎవరు ఏమనుకున్నా తాను అనుకున్నదే చేసే రామ్ గోపాల్ వర్మ తాజాగా ట్విట్టర్ వేదికగా చేసిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ మారింది.

కొండ మురళి జీవితకథ ఆధారంగా తెరకెక్కిస్తున్న "కొండ" చిత్ర షూటింగ్ వరంగల్ పరిసర ప్రాంతాల్లో జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. అయితే తాజాగా వరంగల్ మైసమ్మ గుడిని సందర్శించిన రామ్ గోపాల్ వర్మ విస్కీ బాటిల్ ను నైవేద్యంగా ఇస్తున్న ఫోటోని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు. మాములుగా తెలుగు ఆచారాల ప్రకారం గ్రామ దేవతలను మందుని నైవేద్యం ఇవ్వడం తరతరాలుగా వస్తున్న ఆచారం.

అయితే వర్మ గుడిలో ఈ విస్కీ బాటిల్ తో కనిపించడంతో నెటిజన్లు ఒక్కోరూ ఒక్కోరకంగా కామెంట్స్ చేస్తూ వర్మపై ఫైర్ అవుతున్నారు. ఏదేమైనా నేను నా వోడ్కా నా సినిమా అంటూ ఎవరి మనోభావాలను లెక్కచేయకుండా తనకి నచ్చినట్లుగా బ్రతుకుతూ నచ్చని వ్యక్తులపై నచ్చినట్టుగా కామెంట్స్ చేస్తూ తన వ్యక్తిగత స్వేచ్చతో పాటు రాక్షసానంధాన్ని మన దేశంలో పొందుతున్న ఏకైక వ్యక్తి ఎవరు అంటే మాత్రం రామ్ గోపాల్ వర్మ పేరే ఉంటుంది.

Sandeep Reddy

Sandeep Reddy

Next Story