RGV: ఆర్యన్ ని సూపర్ డూపర్ స్టార్ చేసినందుకు జై ఎన్సీబీ అంటూ వర్మ ట్వీట్

* ఆర్యన్ ఖాన్ ఇష్యూ పై రామ్ గోపాల్ వర్మ వరుస ట్వీట్లు

Sandeep Reddy
Published on: 14 Oct 2021 3:02 PM IST
Ram Gopal Varma Comments on Aryan Khan Issue in Twitter
X

RGV Tweets: నేను షారుఖ్ అభిమానిని.. జై ఎన్సీబీ అంటూ వర్మ ట్వీట్

Ram Gopal Varma: దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశాడు. ఈసారి బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ పై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఒక సూపర్ స్టార్ కొడుకును సూపర్ డూపర్ స్టార్ గా చేసినందుకు ఎన్సీబీ కు ధన్యవాదాలు చెబుతూనే నేను షారుఖ్ ఖాన్ కి నిజమైన అభిమానిని అంటూ జై ఎన్సీబీ అని ట్వీట్ చేశాడు.

తన తండ్రి కంటే ముందుగానే ఆర్యన్ ఖాన్ ని మీడియా, ఎన్సీబీలు లాంచ్ చేసి అగ్రస్థానంలో నిలిచాయని తెలిపాడు. ప్రస్తుత సమయంలో ఆర్యన్ ఖాన్ తన తండ్రి దగ్గరి కంటే కూడా జైల్లోనూ, ఎన్సీబీ వద్దే జీవితం గురించి ఎక్కువగా నేర్చుకున్నాడని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ చేశాడు. ఇక ప్రస్తుతం ఆర్యన్ ఖాన్ పరిస్థితిని రామ్ గోపాల్ వర్మ ఇలా సినిమా రూపంలో ట్విట్టర్ లో వివరించాడు.

సినిమా : రాకెట్

హీరో : ఆర్యన్ ఖాన్ సన్నాఫ్ షారుఖ్ ఖాన్

నిర్మాత : ఎన్సీబీ

సహా నిర్మాతలు : కొన్ని రాజకీయ పార్టీలు

దర్శకత్వం : మీడియా


Sandeep Reddy

Sandeep Reddy

Next Story