రాంగోపాల్ వర్మ 'కుల' కలం

రాంగోపాల్ వర్మ కుల కలం
x
Highlights

సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో రాంగోపాల్ వర్మకి తెలిసినంతగా ఎవరికీ తెలీదు. అందరిదీ ఒకదారి అయితే, ఈయనది ఇంకో దారి

సినిమాని ఎలా ప్రమోట్ చేసుకోవాలో రాంగోపాల్ వర్మకి తెలిసినంతగా ఎవరికీ తెలీదు. అందరిదీ ఒకదారి అయితే, ఈయనది ఇంకో దారి. అందరూ మా సినిమా బావుంటుంది. మా హీరో చాలా గొప్పోడు. ఈ సినిమా హీరోయిన్ ఇరగదీసింది. మాది ఫ్యామిలీ సినిమా ఇలాంటి మాటలతో సినిమాని ప్రమోట్ చేసుకుంటారు. కానీ, ఆర్జీవీ మాత్రం సినిమాకి సంబంధం లేని విషయాల్ని ప్రస్తావించి.. వాటిని వేడెక్కించి.. కావాల్సిన ప్రచారం సాధిస్తారు. ఇదిగో ఈసారి కులాల్ని వాడుకునే ప్రయత్నంలో పడ్డారు. ఇప్పటికే కులాల పేర్లతో 'కమ్మరాజ్యంలో కడప రెడ్లు' పేరుతో సినిమా తీస్తున్నానని ప్రకటించి.. పాటల్ని కూడా వరుసగా విడుదల చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో తాజాగా తన సినిమా పాటను విడుదల చేయడానికి ట్రేండింగ్ లో ఉన్న సాహోను టార్గెట్ చేశారు.

సాహో కోసం కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే ఆ సినిమా హీరో ప్రభాస్. అతని కులం నా కులం ఒక్కటే. నాకు కులాభిమానం ఎక్కువ అంటూ ట్వీట్ చేశారు. దానితో పాటు కమ్మరాజ్యంలో.. సినిమాకి సంబంధించిన కొత్త పాటను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించారు. ఈనెల 27 ఉదయం 9:27 నిమిషాలకు బ్రహ్మ ముహూర్తంలో సినిమా పాటను విడుదల చేస్తామని ప్రకటించారు. ఇప్పుడు ఈ ట్వీట్ విపరీతంగా వైరల్ అవుతోంది. కులాభిమానం అంటే ఏమిటో ఆయన ప్రచారానికి వినియోగించుకుంటున్న తీరు చూసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.



Show Full Article
Print Article
More On
Next Story
More Stories