అనురాగ్‌ కశ్యప్‌కి మద్దతిచ్చిన వర్మ!

Ram Gopal Varma : బాలీవుడ్‌ టాప్ డైరెక్టర్ అనురాగ్‌ కశ్యప్‌ లైంగిక ఆరోపణలు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే.. నటి పాయల్‌ ఘోష్‌

Krishna
Published on: 21 Sept 2020 5:49 PM IST
అనురాగ్‌ కశ్యప్‌కి మద్దతిచ్చిన వర్మ!
X

Ram Gopal Varma, Anurag Kashyap

Ram Gopal Varma : బాలీవుడ్‌ టాప్ డైరెక్టర్ అనురాగ్‌ కశ్యప్‌ లైంగిక ఆరోపణలు ఎదురుకుంటున్న సంగతి తెలిసిందే.. నటి పాయల్‌ ఘోష్‌ ఓ ఇంటర్వ్యూలో అనురాగ్‌ కశ్యప్‌ చెప్పి ఇంటికి రమ్మని చెప్పి చాలా అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఆరోపణలు చేసింది.. ఆమె చేసిన వాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.. అనురాగ్‌ కశ్యప్‌కు పలువురు బాలీవుడ్‌ నటులు మద్దతు పలుకుతున్నారు.

తాజాగా టాలీవుడ్ సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అనురాగ్‌ కశ్యప్‌ కి మద్దుతు నిలిచాడు.. "నాకు తెలిసిన అనురాగ్‌ కశ్యప్‌ చాలా సున్నితమైన, భావోద్వేగాలు కల వ్యక్తి. నాకు అతడు గత 20 ఏళ్లుగా తెలుసు. ఇన్నేళ్ల కాలంలో ఆయన ఎవరినీ బాధపెట్టడం గురించి నేను ఎప్పుడూ చూడలేదు, వినలేదు.. కనుక ప్రస్తుతం జరిగే దాని గురించి స్పష్టంగా చెప్పలేను" అంటూ వర్మ ట్వీట్ చేశాడు.

బాలీవుడ్ నటి రాధికా ఆప్టే కూడా అనురాగ్‌ కశ్యప్‌ కి అండగా నిలిచింది. 'నువ్వు నాకు చాలా దగ్గరి స్నేహితుడివి. చాలా విషయాల్లో ఆదర్శంగా నిలిచావు. అండగా ఉన్నావు. అన్నిసార్లు సమానంగా ప్రేమను పంచావు. నీతో ఉంటే భద్రంగా ఉన్నట్లు అనిపిస్తుంది. నువ్వు నాకు చాలా నమ్మకమైన మిత్రుడివి. లవ్యూ' అని రాధికా ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది.

అనురాగ్‌ కశ్యప్‌ స్పందన :

నటి పాయల్ ఘోష్ చేసిన వాఖ్యాలపైన దర్శకుడు అనురాగ్‌ కశ్యప్‌ ట్విట్టర్ వేదికగా స్పందించారు. ఆమె చేసిన ఆరోపణలు అన్ని నిరాధారమైనవన్నారు. ఈ మేరకు అయన ట్విటర్‌ వేదికగా పలు ట్వీట్లు చేశారు.ఆమె చేసిన ఆరోపణల వలన చాలా మంది నుంచి ఫోన్స్, మెస్సేజ్‌లు వచ్చినట్టుగా అనురాగ్‌ కశ్యప్‌ వెల్లడించాడు.

అయితే ఆమె చేసిన ఆరోపణలకి ఎవరు స్పందించవద్దు అని చెప్పినప్పటికీ నటి పాయల్‌ ఘోష్‌ కి సమాధానం చెప్పడానికి ముందుకు వచ్చినట్టుగా వెల్లడించాడు. ఒక మహిళ అయిన మీరు.. నాతో కొంతమంది నటీమణులకు సంబంధాలున్నాయంటూ ఆరోపించడం తప్పుగా అనిపించలేదా? అంటూ అనురాగ్‌ కశ్యప్‌ తన ట్విట్టర్ లో పేర్కొన్నారు.

Krishna

Krishna

Next Story