దర్శకుడిపైన వివాదాస్పద వ్యాఖ్యలు... ప్రాణహాని ఉందంటూ ప్రధానికి ట్యాగ్!

దర్శకుడిపైన వివాదాస్పద వ్యాఖ్యలు... ప్రాణహాని ఉందంటూ ప్రధానికి ట్యాగ్!
x

Payal Ghosh, Anurag Kashyap

Highlights

Payal Ghosh Allegations : బాలీవుడ్‌ టాప్ డైరెక్టర్ అనురాగ్‌ కశ్యప్‌ పైన నటి పాయల్‌ ఘోష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. తాజాగా

Payal Ghosh Allegations : బాలీవుడ్‌ టాప్ డైరెక్టర్ అనురాగ్‌ కశ్యప్‌ పైన నటి పాయల్‌ ఘోష్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.. తాజాగా ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె అనురాగ్‌ కశ్యప్‌ పైన కీలక వాఖ్యలు చేశారు. ఓ సారి తనతో ఎదో మాట్లాడాలని ఉంది అంటూ అనురాగ్‌ కశ్యప్‌ తనకి ఫోన్ చేశాడని ఆ మరుసటి రోజున ఆయన ఇంటికి వెళ్ళినప్పుడు అనురాగ్‌ కశ్యప్‌ మద్యం తాగి డ్రగ్స్‌ కూడా తీసుకున్నట్లుగా అనిపించిందని వెల్లడించింది. అయితే వెంటనే ఆయన నన్ను ఓ గదిలోకి తీసుకువెళ్లి.. నా దుస్తులు విప్పబోయాడని చెప్పుకొచ్చింది.. అయితే తానూ ప్రతిఘటించానని వెల్లడించింది..

అయితే ఇదంతా ఇక్కడ సాధారణమని చాలా మంది హీరోయిన్ లు తన దగ్గరికి వస్తారని అనురాగ్‌ కశ్యప్‌ వాఖ్యలు చేసినట్టుగా ఆ ఇంటర్వ్యూలో వెల్లడించింది.. అంతేకాకుండా తాను ఇండస్ట్రీకి ఓ మర్యాదపూర్వకమైన కుటుంబం నుంచి వచ్చానని, తనకి అమితాబ్ అంటే చాలా గౌరవం, ఇష్టమని, ప్రస్తుతం తనకి ఇండస్ట్రీలో ఓ మంచి గుర్తింపు ఉందని అనురాగ్ చెప్పినట్టుగా పాయల్‌ అన్నారుఈ సంఘటన జరిగిన సమయంలో అనురాగ్‌, రణబీర్‌ కపూర్‌తో 'బాంబే వెల్వెట్‌' అనే సినిమాని చేస్తున్నట్టుగా పాయల్‌ వెల్లడించారు.

అనురాగ్‌ కశ్యప్‌ పైన కీలక వాఖ్యలు చేయడంతో ఇప్పుడు తనకి ప్రాణహాని ఉందని ట్విట్టర్ వేదికగా పీఎంవోని ట్యాగ్‌ చేస్తూ ట్వీట్‌ చేసింది. పీఎంవో, నరేంద్రమోదీ జీ.. అనురాగ్‌ కశ్యప్‌ నాతో చాలా ఇబ్బందికరంగా ప్రవర్తించాడు.. ప్రస్తుతం తాన నుంచి నాకు ప్రాణహాని ఉంది.. ఆ విషయంలో నాకు సహాయం చేయండి. అతనిపైన తగిన చర్యలు తీసుకోగలరు" అని ట్వీట్ చేసింది. ఈ ట్వీట్ పైన కంగనా స్పందిస్తూ అతని అరెస్ట్ చేయాలనీ డిమాండ్ చేసింది.Show Full Article
Print Article
Next Story
More Stories