అమితాబ్ బచ్చన్ కి బిగ్ షాక్ ఇచ్చిన కూకట్‌పల్లి కోర్టు!

Amitabh Bachchan Jhund Movie : బాలీవుడ్ మెగస్టార్ అమితాబ్ బచ్చన్ కి హైదరాబాద్ కూకట్‌పల్లి కోర్టు బిగ్ షాక్ ని ఇచ్చింది.. ఆయన‌

Krishna
Published on: 20 Sept 2020 10:45 AM IST
అమితాబ్ బచ్చన్ కి బిగ్ షాక్ ఇచ్చిన కూకట్‌పల్లి కోర్టు!
X

amitabh bachchan

Amitabh Bachchan Jhund Movie : బాలీవుడ్ మెగస్టార్ అమితాబ్ బచ్చన్ కి హైదరాబాద్ కూకట్‌పల్లి కోర్టు బిగ్ షాక్ ని ఇచ్చింది.. ఆయన‌ నటించిన "ఝుండ్" సినిమా మూవీ ఓవర్ ద టాప్ (ఓటీటీ) ప్లాట్‌ఫామ్‌లపైనా స్ట్రీమ్ కాకపోవచ్చు.. సుమారుగా ఏడాది కాలం పాటుగా కాపీరైట్ వివాదంలో నడుస్తోన్న ఆ సినిమా విడుదలకు న్యాయస్థానం స్టే ఇచ్చింది. ఈ మేరకు హైదరాబాద్ కూకట్‌పల్లి న్యాయస్థానం ఆదేశాలను జారీ చేసింది. విదేశాల్లో కూడా ఈ సినిమాని స్ట్రీమింగ్‌ను నిలిపివేయాలని పేర్కొంది.

"ఝుండ్" సినిమాలో అమితాబ్ కీ రోల్ ప్లే చేశారు . ఇందులో అయన స్పోర్ట్స్ జానర్‌లో తెరకెక్కిన ఈ సినిమాలో అమితాబ్ ఫుట్‌బాల్ కోచ్‌గా నటించారు. స్లమ్‌ సాకర్‌ ఛాంపియన్‌ అఖిలేశ్‌ పాల్‌ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాకి నాగరాజ్ పోపట్‌రావ్ మన్జులే దర్శకత్వం వహించారు. ఇక సినిమా విడుదలకు సిద్ధమవుతున్న వేళ.. కాపీరైట్స్‌ వివాదాల్లో చిక్కుకుంది.

అయితే ఈ సినిమాకి సంబంధించిన కాపీరైట్స్‌ తన దగ్గర ఉన్నాయని మియాపూర్‌కు చెందిన ఫిల్మ్‌మేకర్ డాక్టర్‌ నంది చిన్నికుమార్‌ న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. దీనిని విచారణ చేప్పట్టిన కూకట్‌పల్లి న్యాయస్థానం అమితాబ్ తో పాటుగా దర్శక నిర్మాతలకి ఇదివరకే నోటీసులను జారీ చేసింది. అయితే తాజాగా దీనిపైన కూకట్‌పల్లి తీర్పును ఇచ్చింది. సినిమా ప్రదర్శన, విడుదలపై స్టే ఇచ్చింది. ఇక విదేశాల్లో కూడా ఈ సినిమాని స్ట్రీమింగ్‌ను నిలిపివేయాలని వెల్లడించింది.

Krishna

Krishna

Next Story