నాకు కరోనా రాలేదు.. వచ్చింది మలేరియా మాత్రమే!

అసలే సోషల్ మీడియా.. కొంచం జరిగితేనే ఇంకేది జరిగినట్టు ప్రచారం చేస్తుంటారు.

Krishna
Published on: 2 May 2020 10:12 PM IST
నాకు కరోనా రాలేదు.. వచ్చింది మలేరియా మాత్రమే!
X
Payal Ghosh (File Photo)

అసలే సోషల్ మీడియా.. కొంచం జరిగితేనే ఇంకేది జరిగినట్టు ప్రచారం చేస్తుంటారు. తాజాగా ఓ నటికి ఇలాంటి అనుభవమే ఎదురైంది. పాయల్‌ ఘోష్‌... ఈ నటి గురించి అందరికి తెలియకపోవచ్చు... మంచు మనోజ్‌తో 'ప్రయాణం' , ఎన్టీఆర్‌తో కలిసి 'ఊసరవెల్లి' సినిమాలో కలిసి నటించింది. అయితే పాయల్‌ ఘోష్‌ గత కొద్దిరోజులుగా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంది. దీనితో ఆమెను ఆస్పత్రికి వెళ్లారు. దీనితో ఆమెకి కరోనా వచ్చిందంటూ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ అయింది. దీనితో వెంటనే అలెర్ట్ అయిన పాయల్‌ ఘోష్‌ తన ఆరోగ్యం పైన వస్తున్న వార్తలకి చెక్ పెట్టింది.

నేను గత కొద్ది రోజులగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న మాట వాస్తవమే.. నాకు ముందుగా తలనొప్పి ప్రారంభమై అతర్వాత జ్వరం వచ్చింది. దీనితో నా సన్నిహితులు, కుటుంబ సభ్యులు ఆందోళనకు గురి అయ్యారు. వెంటనే ఆస్పత్రికి తీసుకెళ్లి టెస్టులు చేపించారు. వైద్య పరీక్షల్లో మలేరియా జ్వరం అని తేలింది. ప్రస్తుతం కోలుకుంటున్నాను. ఇక ప్రపంచాన్నీ భయపెడుతున్న కరోనా వైరస్‌ నుంచి త్వరలోనే ముగుస్తుందని నమ్ముతున్నానని పాయల్‌ ఘోష్‌ వెల్లడించింది.


Krishna

Krishna

Next Story