మరోసారి కోర్టుకు రకుల్!

Rakul Preet Singh Again Moved To HC : బాలీవుడ్ డ్రగ్స్ కేసులో హస్తం ఉందంటూ ఆరోపణలు ఎదురుకుంటున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి కోర్టును ఆశ్రయించింది.. తన పైన మీడియాలో వస్తున్న కథనాలను వెంటనే ఆపాలంటూ ఆమె కోర్టుకు వెళ్ళింది.

Krishna
Published on: 29 Sept 2020 3:29 PM IST
మరోసారి కోర్టుకు రకుల్!
X

Rakul Preet Singh

Rakul Preet Singh Again Moved To HC : బాలీవుడ్ డ్రగ్స్ కేసులో హస్తం ఉందంటూ ఆరోపణలు ఎదురుకుంటున్న నటి రకుల్ ప్రీత్ సింగ్ మరోసారి కోర్టును ఆశ్రయించింది.. తన పైన మీడియాలో వస్తున్న కథనాలను వెంటనే ఆపాలంటూ ఆమె కోర్టుకు వెళ్ళింది. తనపై ఎటువంటి కథనాలు ప్రసారం చేయకుండా సమాచార ప్రసారాల శాఖకు ఆదేశాలు జారీ చేయాలని కోరింది. ఈ మేరకు ముంబై హైకోర్టులో పిటిషన్లు దాఖలు చేసింది. ఈ కథనాలు తన ప్రతిష్టకు భంగం కలిగే విధంగా ఉన్నాయని, వీటిని నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని ఆమె ఆ పిటిషన్ లో పేర్కొంది.

రకుల్ వేసిన పిటిషన్ పైన ఇవాళ ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. కేంద్రంతో పాటు సమాచార, ప్రసార శాఖ, ప్రసార భారతి, ఎన్‌బీఏ, ప్రెస్‌ కౌన్సిల్‌కు ఢిల్లీ హైకోర్టు మ‌ధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. డ్రగ్స్ కేసు విచార‌ణ పూర్తయ్యే వ‌ర‌కు మీడియాలో క‌థ‌నాలు నియంత్రించేలా చర్యలు తీసుకోవాలని, కొంత స్వీయ నియంత్రణ పాటించాల‌ని సూచించింది. ఇక అటు రకుల్ తానూ ఎలాంటి డ్రగ్స్ తీసుకోలేదని, తనను సాక్షిగా మాత్రమే NCB విచారణని పిలిచినట్టుగా వెల్లడించింది.

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్ పుత్ అనుమానాస్పద మృతిలో భాగంగా డ్రగ్స్ కోణం బయటకి వచ్చిన సంగతి తెలిసిందే.. దీనితో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) సుశాంత్ ప్రియురాలు రియా చక్రవర్తిని దాదాపుగా నాలుగు రోజుల పాటు విచారించింది. ఈ విచారణలో రియా 25 మంది సెలబ్రిటీల పేర్లుగా చెప్పగా అందులో రకుల్ పేరు కూడా ఉండడంతో ఎన్‌సిబి అధికారులు ఆమెను విచారణకి పిలిచారు. దాదాపుగా నాలుగు గంటల పాటు రియాని విచారించారు అధికారులు.

Krishna

Krishna

Next Story