ఎప్పటికీ మా మెగాస్టార్ మీరే.. చిరంజీవికి శుభాకాంక్షల వెల్లువ!

ఎప్పటికీ మా మెగాస్టార్ మీరే.. చిరంజీవికి శుభాకాంక్షల వెల్లువ!
x
Highlights

అప్పటికీ ఇప్పటికీ మెగాస్టార్ ఒక్కరే అంటూ చిరంజీవికి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఒక పక్క అభిమానులు తమదైన శైలిలో వేడుకలు చేసుకుంటుంటే.. మరోపక్క సెలబ్రిటీలు సోషల్ మీడియాలో శుభాకాంక్షల వరద పారిస్తున్నారు.

మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు వేడుకలు ఎక్కడికక్కడ అభిమానులు ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. మరోపక్క అలుపెరుగని ఈ సినీ యోధునికి సినీమా ప్రపంచంలోని సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు అందచేస్తున్నారు. ఆ శుభాకాంక్షల వర్షం నుంచి కొన్ని చినుకులు మీ కోసం..

- నా జీవితంలో ఒకే ఒక్క మెగాస్టార్ చిరంజీవి గారు. నటుడిగానే కాదు.. నేను చూసిన గొప్ప మానవతా వాదిగా ఆయనే మా మెగాస్టార్ అంటూ స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ట్వీట్ చేశారు.

- వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ చిరంజీవి గారికి శుభాకాంక్షలు.. మీ చేయి ఇంకా రఫ్ గానే ఉంది సర్ అంటూ మంచు మనోజ్ ట్వీట్ చేశారు.

- బాస్ ఆఫ్ ఏమ్పరర్ కి శుభాకాంక్షలు అంటూ శ్రీముఖి టీం తన సందేశాన్ని పంపింది.

- హ్యాపీ బర్త్ డే చిరంజీవి గారూ అంటూ ఛార్మి చిరంజీవితో తానూ ఉన్న ఫోటోలు షేర్ చేసారు.

- ఇందుకే చిరంజీవి గారిని మెగాస్టార్ అంటారు అంటూ కళ్యాణ్ బాబు పున్నమి నాగు సినిమాలో చిరంజీవి నటించిన ఓ సన్నివేశాన్ని పోస్ట్ చేశారు.

- హ్యాపీ బర్త్ డే అన్నయ్యా అంటూ దర్శకుడు హరీష్ శంకర్ తాను చిన్నప్పుడు చిరంజీవి తో తీయించుకున్న ఫోటో షేర్ చేశారు.








Show Full Article
Print Article
More On
Next Story
More Stories