బాలీవుడ్ ఆఫర్ అందుకున్న పుష్ప బ్యూటీ...

Bollywood Offer: కరణ్ జోహార్ నిర్మాతగా ధర్మ ప్రొడక్షన్స్ ఇప్పుడు రష్మిక ని ఒక సినిమా కోసం ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 24న ముంబైలోని ధర్మ ప్రొడక్షన్స్ ఆఫీస్ వద్ద రష్మిక కనిపించింది.

admin1
Updated on: 27 Jan 2022 11:47 AM IST
Puspa Beauty who received Bollywood offer
X

బాలీవుడ్ ఆఫర్ అందుకున్న పుష్ప బ్యూటీ...

Bollywood Offer: ప్రస్తుతం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోయిన్ల లో రష్మిక మందన పేరు ముందే ఉంటుంది. ఈ మధ్యనే 'పుష్ప' సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న ఈ భామ కూడా తగ్గేది లేదంటూ సినిమాలు సైన్ చేస్తోంది. ఒకవైపు టాలీవుడ్ లో మాత్రమే కాక మరోవైపు బాలీవుడ్ లో కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటోంది రష్మిక. ఇప్పటికే "మిషన్ మజ్ను", "గుడ్ బై" సినిమాలతో త్వరలో హిందీ ప్రేక్షకులను అలరించబోతోంది. పుష్ప సినిమా హిందీలో కూడా సూపర్హిట్ అవడంతో ఈ రెండు సినిమాలకీ క్రేజ్ బాగానే పెరిగింది. అయితే తాజా సమాచారం ప్రకారం ఒక ప్రముఖ బాలీవుడ్ సంస్థతో రష్మిక సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది.

కరణ్ జోహార్ నిర్మాతగా ధర్మ ప్రొడక్షన్స్ ఇప్పుడు రష్మిక ని ఒక సినిమా కోసం ఎంపిక చేసుకున్నట్లు తెలుస్తోంది. డిసెంబర్ 24న ముంబైలోని ధర్మ ప్రొడక్షన్స్ ఆఫీస్ వద్ద రష్మిక కనిపించింది. దీంతో ఈ పుకార్లు మొదలయ్యాయి. పుష్ప సినిమా హిందీలో కూడా సూపర్హిట్ అవడంతో రష్మికి కూడా ఫ్యాన్ ఫాలోయింగ్ మొదలైంది. అందుకే రష్మిక తో ధర్మ ప్రొడక్షన్స్ వారు సినిమా చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇక మరో వైపు తెలుగులో శర్వానంద్ సరసన రష్మిక మందన్న "ఆడవాళ్లు మీకు జోహార్లు" సినిమాతో బిజీగా ఉంది.

admin1

admin1

Next Story