Pushpa Update: 'పుష్ప' కోసం ఐటమ్ సాంగ్ రెడీ చేసిన దేవిశ్రీ

Pushpa Update: జానపద బాణీలో సాగే ఈ పాటను రీసెంట్ గా రికార్డు చేశారని టాలీవుడ్ టాక్

Kranthi
Published on: 24 May 2021 11:21 AM IST
Pushpa Update: Solid Item Song in Pushpa Movie
X
పుష్ప మూవీ పోస్టర్ (ఫైల్ ఇమేజ్)

Pushpa Update: స్టైలిష్ డైరెక్టర్ సుకుమార్ - దేవిశ్రీ ప్రసాద్ కాంబినేషన్ అనగానే, ఆ సినిమాలో మాస్ ఆడియన్స్ ను ఒక ఊపు ఊపేసే సాంగ్ ఒకటి ఉంటుందనే విషయం అందరికీ తెలిసిందే. ఐటమ్ సాంగ్ ఉంటే ఆ సినిమా హిట్టే అనే లెక్కలు వేస్తుంటాడు ఈ లెక్కల మాస్టర్. ఒక్క 'నాన్నకు ప్రేమతో' సినిమాలో తప్ప సుక్కు ప్రతి సినిమాలో ప్రత్యేక గీతం ఉంది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా ఐటమ్ సాంగ్ మాత్రం ఓ రేంజ్ లో హిట్ అవుతుంది. ఫస్ట్ సినిమా 'ఆర్య'లో 'అ అంటే అమలాపురం'.. జగడం సినిమాలో '36 24 36'.. 'ఆర్య 2' లో 'రింగ రింగా'.. '100% లవ్' లో 'డియాలో డియాలా'.. వన్ నేనొక్కడినే లో 'లండన్ బాబూ లండన్ బాబూ'.. 'రంగస్థలం' సినిమాలో 'జిల్ జిల్ జిగేలు రాణి' సాంగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

గతంలో ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన ఐటమ్ సాంగ్స్ జనం నాలుకలపై జాతర చేశాయి.ఇప్పటికీ ఫంక్షన్స్ లో ఈ పాటలు సందడి చేస్తూనే ఉంటాయి. అందువలన ఈ ఇద్దరి కాంబినేషన్లో రానున్న సినిమాల్లో ఐటమ్ సాంగ్ పై కూడా అంచనాలు ఉంటాయి. ఈ కారణంగానే ఇద్దరూ కూడా ఒక ఐటమ్ సాంగ్ కి మించి మరో ఐటమ్ సాంగ్ ఉండేలా కేర్ తీసుకుంటూ ఉంటారు.

తాజాగా ఈ ఇద్దరి కాంబినేషన్లో రూపొందుతున్న 'పుష్ప' సినిమాలోనూ ఒక అదిరిపోయే ఐటమ్ ఉండనుందనే వార్తలు వచ్చాయి. ఈ ఐటమ్ సాంగ్ ట్యూన్ ను దేవిశ్రీ ప్రసాద్ వినిపించగానే సుకుమార్ ఫుల్ ఖుషీ అయ్యాడట. జానపద బాణీలో సాగే ఈ పాటను రీసెంట్ గా రికార్డు చేశారని అంటున్నారు. ఐటమ్ సాంగులో ఆడిపాడే బ్యూటీగా ఊర్వశీ రౌతేలా .. దిశా పటాని పేర్లు వినిపించాయి. మరి వీరిలో బన్నీతో కలిసి చిందులు వేసే ముద్దుగుమ్మ ఎవరో చూడాలి. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై పాన్ ఇండియా లెవెల్ లో రూపొందుతున్న ఈ మూవీని దసరాకి విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్టుగా సమాచారం.

Kranthi

Kranthi

Next Story