బాలీవుడ్ లోకి 'ఇస్మార్ట్ శంకర్'.. హీరోగా ఎవరంటే?

Ismart Shankar Going To Bollywood : డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కీన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'.. గత ఏడాది జులై 18న రిలిజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది.

Krishna
Published on: 5 Oct 2020 11:48 AM IST
బాలీవుడ్ లోకి ఇస్మార్ట్ శంకర్.. హీరోగా ఎవరంటే?
X

 ismart shankar

Ismart Shankar Going To Bollywood : డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కీన చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'.. గత ఏడాది జులై 18న రిలిజైన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. టెంపర్ మూవీ తరవాత అటు పూరికి సరైనా హిట్ లేకపోవడం, ఇక హీరో రామ్ కూడా మంచి మాస్ మసాలా మూవీ చేసి చాలా రోజులు కావడంతో వీరి కాంబినేషన్ పై మంచి బజ్ ఏర్పడింది. అందుకు తగట్టు మణిశర్మ అందించిన మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా విడుదలై థియేటర్లలో విజిల్స్, గోలలు మధ్య భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. పూరికి దర్శకుడిగా మాత్రమే కాదు చార్మీతో కలిసి పెట్టిన పెట్డుబడికి మూడింతల లాభాల్ని తీసుకొచ్చింది ఈ సినిమా..

అయితే ఈ సినిమా ఇప్పుడు హిందీలో రీమేక్ అవ్వనుంది. వరుసగా అక్కడ తెలుగు సినిమాలు రిమేక్ అవుతున్న సంగతి తెలిసిందే.. అందులో భాగంగానే ఈ సినిమాని రీమేక్ చేసే ఆలోచనలో ఉన్నారట మేకర్స్.. ఈ సినిమాలో హీరోగా రణ్ వీర్ సింగ్ నటించబోతున్నాడని తెలుస్తుంది. ప్రస్తుతం చర్చలు నడుస్తున్నాయి.. ఒరిజినల్ ని డైరెక్ట్ చేసిన పూరీనే ఈ సినిమాను కూడా డైరెక్ట్ చేయనున్నారని సమాచారం.. దీనిపైన త్వరలో అధికార ప్రకటన రానుంది..

ఇక పూరి, విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని చార్మీ, పూరి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత మంచి మళ్ళీ హిట్ బాట పడ్డ పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండతో సినిమా చేస్తుండడంతో సినిమాపైన భారీ అంచానాలు ఉన్నాయి.

Krishna

Krishna

Next Story