Ismart shankar : 24 గంటలు గడవక ముందే 11 మిలియన్ వ్యూస్

Ismart shankar : 24 గంటలు గడవక ముందే 11 మిలియన్ వ్యూస్
x
Highlights

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కీన ఈ చిత్రం గత ఏడాది జులై 18న రిలిజై భారీ విజయాన్ని అందుకుంది....

డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కీన ఈ చిత్రం గత ఏడాది జులై 18న రిలిజై భారీ విజయాన్ని అందుకుంది. టెంపర్ మూవీ తరవాత అటు పూరికి సరైనా హిట్ లేకపోవడం, ఇక హీరో రామ్ కూడా మంచి మాస్ మసాలా మూవీ చేసి చాలా రోజులు కావడంతో వీరి కాంబినేషన్ పై మంచి బజ్ ఏర్పడింది. అందుకు తగట్టు మణిశర్మ అందించిన మ్యూజిక్ కి మంచి రెస్పాన్స్ రావడంతో సినిమా విడుదలై థియేటర్లలో విజిల్స్, గోలలు మధ్య భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.

పూరికి దర్శకుడిగా మాత్రమే కాదు చార్మీతో కలిసి పెట్టిన పెట్డుబడికి మూడింతల లాభాల్ని తీసుకొచ్చింది ఈ సినిమా.. అయితే టీవీలో ప్రసారం చేస్తే అదిరిపోయే టీఆర్పీ రేటింగ్స్ కూడా వచ్చాయి. తాజాగా ఈ సినిమాని హిందీలో డబ్ చేసి యూట్యూబ్‌లో రిలీజ్ చేస్తే అక్కడ 24 గంటలు గడవక ముందే 11 మిలియన్ వ్యూస్ సంపాదించింది. ఒక్క రోజులోనే ఇన్ని వ్యూస్ సంపాదించుకోవడం అంటే మామలు విషయం కాదు. ఇంకా ఈ సినిమా ఇంకెన్ని వ్యూస్ ని సంపాదిస్తుంది అన్నది చూడాలి మరి! నిధి అగర్వాల్, నభా నటేష్ హీరోయిన్స్ గా నటించారు. ఇక ఈ సినిమాకి ఇప్పటికే పలు విభాగాల్లో అవార్డులు లభించాయి.

కిషోర్ తిరుమలతో రామ్ :


ప్రస్తుతం రామ్, కిషోర్ తిరుమలతో రెడ్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాలో నివేతా పెతురాజ్ హీరోయిన్ గా నటిస్తోంది! మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు. స్రవంతి రవికిషోర్ సినిమాని నిర్మిస్తున్నాడు. గతంలో రామ్, కిషోర్ తిరుమల కాంబినేషన్ లో నేను శైలజ, ఉన్నది ఒక్కటే జిందగీ అనే సినిమాలు వచ్చి డిసెంట్ హిట్ గా నిలిచాయి.

విజయ్ దేవరకొండతో పూరి :


ఇక పూరి, విజయ్ దేవరకొండ హీరోగా ఫైటర్ అనే సినిమాని చేస్తున్నాడు. ఈ సినిమాని చార్మీ, పూరి కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా ఈ సినిమా తెరకెక్కుతుంది. ఇస్మార్ట్ శంకర్ సినిమా తర్వాత మంచి మళ్ళీ హిట్ బాట పడ్డ పూరి జగన్నాధ్ విజయ్ దేవరకొండతో సినిమా చేస్తుండడంతో సినిమాపైన భారీ అంచానాలు ఉన్నాయి. దసరాకి ఈ సినిమాని రిలీజ్ చేయనున్నారు. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటించనుంది.

Show Full Article
Print Article
More On
Next Story
More Stories