Prabhas Adi Purush Movie Updates: ప్రభాస్ 'ఆదిపురుష్'లో ప్రతి నాయకుడుగా బాలీవుడ్ నటుడు!

Prabhas Adi Purush Movie Updates: ప్రభాస్ ఆదిపురుష్లో ప్రతి నాయకుడుగా బాలీవుడ్ నటుడు!
x
Prabhas Adi Purush Movie Updates
Highlights

Prabhas Adi Purush Movie Updates: రెబల్ స్టార్ ప్రభాస్ త‌న అభిమానుల చాలా పెద్ద స‌ర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో ‘ఆదిపురుష్’ అనే భారీ చిత్రం తెర కెక్క‌నున్న‌ట్టు ప్రకటించారు

Prabhas Adi Purush Movie Updates: రెబల్ స్టార్ ప్రభాస్ త‌న అభిమానుల చాలా పెద్ద స‌ర్ ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. బాలీవుడ్ సంచలన దర్శకుడు ఓం రౌత్ (తానాజీ ఫేమ్) దర్శకత్వంలో 'ఆదిపురుష్' అనే భారీ చిత్రం తెర కెక్క‌నున్న‌ట్టు ప్రకటించారు. 'ఆదిపురుష్ ' సినిమా పేరే కాదు.. 'చెడు మీద మంచి సాధించిన విజయం' అనే ట్యాగ్ లైన్‌ కూడా అభిమానుల్లో మ‌రింత ఉత్స‌హాన్ని రేపుతుంది. ఈ చిత్రం రామాయణం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కిస్తుండ‌టం.. ఆదిపురష్ టైటిల్ లోగో సైతం.. సోషియో ఫాటసీ కథా నేపథ్యంలోనే ఉండటం.. ఈ చిత్రంలో ప్రభాస్.. రాముడి పాత్రను పోలిన పాత్రను పోషిస్తాడని తెలుస్తోంది. 'ఆదిపురుష్' సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో భారీ బడ్జెట్‌తో రూపొందిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలో సీత పాత్రకోసం కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది.

ఈ క్ర‌మంలోనే ఈ చిత్రంలో ప్ర‌తినాయ‌కుడు రావ‌ణాసురిడిగా ప్రముఖ బాలీవుడ్ నటుడు నటించనున్నారని, ఆ పాత్రలో ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ న‌టించ‌నున్నార‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది. దర్శకుడు ఓం రౌత్ తొలి చిత్రం 'తానాజీ'లో సైఫ్ అలీ ఖాన్ నటించారు. ఆ చిత్రంలో సైఫ్ అలీ ఖాన్ ప్ర‌తి నాయకుడైన ఉదయభాన్ సింగ్ రాథోడ్ పాత్ర పోషించి.. విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు పొందారు. అందుకే, రావణుడి పాత్రకు ఆయనైతే న్యాయం చేయగలరని ఓం రౌత్ భావించారట. సైఫ్ కూడా ఈ పాత్ర‌కు ఓకే అన్న‌ట్టు తెలుస్తుంది. అయితే దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది. ఈ చిత్రంలో న‌టించే వారి వివ‌రాల‌ను త్వ‌ర‌లోనే వెల్ల‌డిస్తార‌ని స‌మాచారం. కాగా, ఈ చిత్ర నిర్మాణానికి టీ సిరిస్ సంస్థ ఏకంగా రూ 1000 కోట్లు వెచ్చించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. అంటే.. ప్రభాస్ ఖాతాలోనే కాదు.. భారతీయ సినిమాలోనే భారీ బడ్జెట్ మూవీగా నిర్మితంకానుద‌న్న‌మాట.

Show Full Article
Print Article
Next Story
More Stories