Sanjay Dutt KGF : కెజిఎఫ్-2కి లైన్ క్లియర్!

Sanjay Dutt KGF : కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా వచ్చిన కెజిఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అన్ని

Krishna
Published on: 18 Aug 2020 5:17 PM IST
Sanjay Dutt KGF : కెజిఎఫ్-2కి లైన్ క్లియర్!
X
Sanjay Dutt in KGF (File Photo)

Sanjay Dutt KGF : కన్నడ స్టార్ హీరో యశ్ హీరోగా వచ్చిన కెజిఎఫ్ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికి తెలిసిందే.. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద అన్ని రికార్డులను బద్దలుకొట్టింది. ఈ చిత్రం విడుదలైన తరువాత శాండల్ వుడ్ రాకింగ్ స్టార్ గా యశ్ పేరు సంపాందించుకున్నాడు.. ఇప్పడు ఈ సినిమాకి సీక్వెల్ గా కెజిఎఫ్-2 తెరకెక్కుతుంది. ఇక ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ హీరో సంజయ్ దత్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.. ఇందులో అయన 'అధీరా'గా కనిపించనున్నాడు.. ఇప్పటికే రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్ కి విశేషమైన స్పందన వచ్చింది. అయితే నిందితుడు అయిన సంజయ్ దత్ సినిమాల్లో నటించడం ఏంటి అని ఓ వ్యక్తి కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా దానిపైన తాజాగా తీర్పు ఇచ్చింది హైకోర్టు..

ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందుతుడిగా శిక్షను ఎదురుకుంటున్నాడు సంజయ్ దత్.. అయితే దీనినే కారణంగా చూపుతూ ఓ వ్యక్తి కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ ఓ నిందితుడు నటిస్తున్న సినిమాకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇచ్చిందని ప్రశ్నించాడు. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై జరిగిన అనేక వాదోపవాదాల అనంతరం కెజిఎఫ్-2 సినిమా యూనిట్‌కి ఫేవర్‌గా హైకోర్టు తీర్పునిచ్చింది. అయితే ఒక సినిమాలో నటించడాన్ని నిషేధించిన చట్టాన్ని పిటిషనర్‌ తరఫున న్యాయవాది చూపించలేకపోవడంతో సంజయ్ దత్‌పై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది హైకోర్టు.. దీనితో ఈ సినిమా విడుదలకి లైన్ క్లియర్ అయిపొయింది. ఇక కేజీఎఫ్ 2 లో శ్రీనిధి శెట్టి, రవీనా టాండన్ మరియు అనంతనాగ్ ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.

Krishna

Krishna

Next Story