Keerthy Suresh In Prabhas Movie : ప్రభాస్ ఆదిపురుష్ లో కీర్తి సురేష్?

Keerthy Suresh In Prabhas Movie : ప్రభాస్ ఆదిపురుష్ లో కీర్తి సురేష్?
x
Keerthy Suresh (File Photo)
Highlights

Keerthy Suresh In Prabhas Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.. 'ఆదిపురుష్' అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తూ మరో

Keerthy Suresh In Prabhas Movie : యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ తన 22వ చిత్రాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే.. 'ఆదిపురుష్' అనే టైటిల్ ని ఫిక్స్ చేస్తూ మరో పాన్ ఇండియా మూవీని చేస్తున్నాడు ప్రభాస్... ఇది ప్రభాస్ కి 22 వ సినిమా... ఈ సినిమాకి 'తానాజీ' ఫేమ్ ఓం రౌత్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడగా, టీ సిరీస్ భూషణ్ కుమార్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రీ లుక్ పోస్టర్ ద్వారా ఈ మూవీ చారిత్రక నేపథ్యంలో భారీ ఎత్తున రూపొందనుందని సమాచారం.. ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందిస్తున్నారు.

అయితే ఈ సినిమాలో ప్రభాస్ రాముడి పాత్రలో కనిపిస్తున్నాడని అందరూ అనుకుంటున్నారు.. అయితే, దీనిపై చిత్ర యూనిట్ ఎలాంటి ప్రకటన చేయలేదు. కానీ దీనిపైన మహానటి ఫేం నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చాడు.. ఈ సినిమా ఫస్ట్ లుక్ పైన ట్విట్టర్ వేదికగా స్పందించిన నాగ్ అశ్విన్ మాత్రం ప్రభాస్ గారిని శ్రీరాముడిగా చూడటానికి చాలా ఆత్రుతగా ఎదురుచూస్తున్నానని, వెండితెరపైన కొందరు మాత్రమే రాముడి పాత్ర పోషించినట్టుగా ట్వీట్ చేశాడు. దీనితో ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నాడని అర్ధం అయిపొయింది.

అయితే రాముడు ఉంటే కచ్చితంగా సీత ఉండాల్సిందే కదా.. అయితే సీతగా ఎవరు నటిస్తారనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో మొదలైంది. తాజా సమాచారం ప్రకారం ఆ పాత్రకోసం కీర్తి సురేష్ పేరు పరిశీలనలో ఉన్నట్టు తెలుస్తోంది. మహానటి సినిమాతో మంచి నటిగా ప్రూవ్ చేసుకుంది కీర్తి సురేష్.. దీనితో ఈ పాత్ర కోసం కీర్తి సురేష్ ను తీసుకోవాలనే ఆలోచనలో చిత్రబృందం ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే పాన్ ఇండియా మూవీ కావడంతో కీర్తిని ఎంపిక చేస్తారా అన్న అనుమానం కలుగుతుంది.

Show Full Article
Print Article
Next Story
More Stories