మెగాస్టార్ టీజర్ నడిపించనున్న పవర్ స్టార్

మెగాస్టార్ సినిమాని పవర్ స్టార్ నడిపిస్తే ఎలా వుంటుంది. అందులోనూ ఉయ్యాలవాడ లాంటి హిస్టారికల్ కథను పవన్ కళ్యాణ్ చెబితే దాని పవర్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అవును.. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఇష్టపడి.. కష్టపడి చేస్తున్న సైరా మూవీ టీజర్ ని తెర వెనుక ఉండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడిపించబోతున్నారు.

K V D Varma
Updated on: 16 Aug 2019 12:22 PM IST
మెగాస్టార్ టీజర్ నడిపించనున్న పవర్ స్టార్
X

మెగాస్టార్ సినిమాని పవర్ స్టార్ నడిపిస్తే ఎలా వుంటుంది. అందులోనూ ఉయ్యాలవాడ లాంటి హిస్టారికల్ కథను పవన్ కళ్యాణ్ చెబితే దాని పవర్ ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. అవును.. మెగాస్టార్ చిరంజీవి ఎంతో ఇష్టపడి.. కష్టపడి చేస్తున్న సైరా మూవీ టీజర్ ని తెర వెనుక ఉండి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నడిపించబోతున్నారు.

స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఆగస్టు 14న 'సైరా' మేకింగ్ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియో ఇప్పటికే సోషల్ మీడియాలో రికార్డులు సృష్టిస్తోంది. ఇక 'సైరా' టీజర్ ఈనెల 18న వస్తుందని ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు ఈ టీజర్‌ పవన్ కళ్యాణ్ స్వరంతో ప్రారంభంకాబోతోంది. 'సైరా' టీజర్‌‌కి కొద్ది రోజుల ముందే పవన్‌ కల్యాణ్‌ వాయిస్‌ ఓవర్‌ చెప్పారు. తమ్ముడు తన చిత్రానికి భావోద్వేగంతో స్వరం వినిపిస్తుంటే.. అన్నయ్య చిరంజీవి పక్కనే ఉన్న ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. సైరా లాంటి విప్లవాత్మకమైన కథను టీజర్ లో చూపించాలంటే.. పవర్ వాయిస్ ఉండాల్సిందే. అప్పుడే ఆ రివల్యూషన్ ఎఫెక్ట్ వస్తుంది. అందుకే రామ్ చరణ్ ఈ టీజర్ కి పవర్ స్టార్ తో వాయిస్ ఓవర్ ఇప్పించినట్టున్నారు.

సురేందర్ రెడ్డి దర్శకత్వంవహిస్తున్న సైరా మూవీని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.

K V D Varma

K V D Varma

Next Story