మరో షాక్ ఇచ్చిన పూనమ్‌ పాండే!

Poonam Pandey Back With Sam Bombay : నటి పూనమ్‌ పాండే సామ్‌ అహ్మద్‌ బాంబే అనే దర్శకుడిని ఈ నెల 10 న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ శుభవార్తని తెలియజేస్తూ తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది.

Krishna
Published on: 27 Sept 2020 3:49 PM IST
మరో షాక్ ఇచ్చిన పూనమ్‌ పాండే!
X

Poonam Pandey back with Sam Bombay

Poonam Pandey Back With Sam Bombay : నటి పూనమ్‌ పాండే సామ్‌ అహ్మద్‌ బాంబే అనే దర్శకుడిని ఈ నెల 10 న వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే.. ఈ శుభవార్తని తెలియజేస్తూ తన భర్తతో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ ఫోటోలు వైరల్ అయ్యాయి.. అనంతరం వీరు హనీమూన్ కి గాను గోవాకి వెళ్లారు. అయితే పెళ్లైన 13 రోజులకే తన భర్త తనని శారీరకంగా హింసిస్తున్నాడు అంటూ పూనమ్‌ పాండే పనాజీ పోలీసులకి ఫిర్యాదు చేసింది. ఓ షూటింగ్ నిమిత్తం గోవాకు వెళ్లిన పూనమ్ అక్కడే పోలీసులకు ఫిర్యాదు చేసింది.

దీనిపైన కేసు నమోదు చేసుకున్న పనాజీ పోలీసులు సామ్‌ బాంబేని అరెస్ట్‌ చేశారు. ఆ తర్వాత ఎలాగోలా బెయిల్ పైన బయటకు వచ్చాడు సామ్‌ అహ్మద్‌ బాంబే.. ఈ క్రమంలో తానూ తన భర్తతో కలిసి ఉంటానని పూనమ్‌ పాండే శనివారం రాత్రి ఇన్‌స్టాగ్రామ్ వేదికగా వెల్లడించింది. మా ఇద్దరి మధ్య ప్రేమ, గౌరవం ఉంది. గొడవలు, మనస్పర్థలు లేకుండా ఏ వివాహబంధం ఉంది? అని పూనమ్‌ పాండే అందులో వెల్లడించింది.

అటు సామ్‌ అహ్మద్‌ బాంబే కూడా తమ పెళ్లి ఫోటోను షేర్ చేస్తూ.. తమ మధ్య ఉన్న గొడవలు ఈనాటితో పోయాయని.. ఇకపై తాము మరెంతో సంతోషంగా ఉంటామని, అన్నాచిన్న చిన్న గొడవలు అనంతరం జీవితాన్ని తిరిగి ప్రారంభిస్తున్నట్లుగా వెల్లడించాడు.

Krishna

Krishna

Next Story