కారులో షికారు.. నటి పూనం పాండేపై పోలీసు కేసు..

Arun Chilukuri
Updated on: 11 May 2020 12:24 PM IST
కారులో షికారు.. నటి పూనం పాండేపై పోలీసు కేసు..
X

బాలీవుడ్ నటి లాక్‌డౌన్ నిబంధ‌న‌లు ఉల్లంఘించి ముంబై పోలీసుల‌కి చిక్కింది. ఆదివారం రాత్రి పూన‌మ్ పాండే త‌న బిఎమ్‌డబ్ల్యూ కారులో చిత్ర దర్శకుడు సామ్ అహ్మద్‌ బాంబేతో క‌లిసి చ‌క్క‌ర్లు కొట్టింది. పూనం పాండే మెరైన్ డ్రైవ్ ప్రాంతంలో తన కారులో తిరుగుతుండగా పోలీసులు పట్టుకున్నారు. ఎటువంటి కారణం లేకుండా నిబంధనలు ఉల్లంఘించి తిరుగుతున్నట్టు గుర్తించారు.

వెంటనే కారును సీజ్ చేసి సెక్షన్ 188, 269, 51 (బి) ల కింద కేసు నమోదుచేశారు. అలాగే ఆమె బీఎండబ్ల్యూ కారును స్వాధీనం చేసుకొని పోలీస్ స్టేషన్‌కి తరలించారు. ఈ విషయాన్ని ముంబై సీనియర్ పోలీసు ఇన్‌స్పెక్టర్ మృత్యుంజయ్ హీరేమత్ మీడియాకు తెలిపారు. పూనం పాండేతో పాటు కారులో ఉన్న శామ్ అహ్మద్ బాంబే అనే వ్యక్తిపై కూడా కేసు నమోదు చేశామని ఆయన తెలిపారు.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story