Kangana Ranaut: తన లైఫ్ సీక్రెట్ ప్రభాస్‎తో షేర్ చేసుకున్న హీరోయిన్..ప్రభాస్ రియాక్షన్ నిజంగా షాకింగ్

Kangana Ranaut: తన లైఫ్ సీక్రెట్ ప్రభాస్‎తో షేర్ చేసుకున్న హీరోయిన్..ప్రభాస్ రియాక్షన్ నిజంగా షాకింగ్
x
Highlights

Kangana Ranaut: సాధారణంగా చాలా మంది తమ పర్సనల్ విషయాలు ఎవరికీ చెప్పుకునేందుకు ఇష్టపడరు. అత్యంత సన్నిహితులకు మాత్రమే చెప్పుకుంటారు. కానీ ఓ హీరోయిన్...

Kangana Ranaut: సాధారణంగా చాలా మంది తమ పర్సనల్ విషయాలు ఎవరికీ చెప్పుకునేందుకు ఇష్టపడరు. అత్యంత సన్నిహితులకు మాత్రమే చెప్పుకుంటారు. కానీ ఓ హీరోయిన్ మాత్రం ప్రభాస్ తో తన లైఫ్ సీక్రెట్స్ నే షేర్ చేసుకుందట.

హీరోయిన్ల కెరీర్ ఎప్పుడు ఎలా ఉంటుందో చెప్పలేం. చాలా మంది హీరోయిన్లు కెరీర్ లో ఎంత పైకి ఎదిగినా చివరికి విషాదకరంగానే జీవితాన్ని ముగించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరికొందరు అనుకోకుండా హీరోయిన్ గా మారి సంచలనం క్రియేట్ చేసిన సందర్భాలూ ఉన్నాయి. సాధారణంగా జీవితానికి సంబంధించిన రహస్యాలు హీరోయిన్లు అత్యంత సన్నిహితులతో మాత్రమే షేర్ చేసుకుంటారు. కానీ ఓ స్టార్ హీరోయిన్ మాత్రమే ప్రభాస్ కు తన జీవితం గురించి చెప్పకుందట. ఆ హీరోయిన్ మరెవరో కాదు ప్రభాస్ తో ఏక్ నిరంజన్ మూవీలో నటించిన కంగనారనౌత్.

అయితే ఈ మూవీ షూటింగ్ సమయంలో కంగనా తన జీవితం గురించి కొన్ని విషయాలను ప్రభాస్ తో షేర్ చేసుకుందట. అసలేం చెప్పిందంటే..తాను ఓ చిన్న గ్రామం నుంచి వచ్చానన సినిమాలతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పిందట. ఓసారి తన ఫ్రెండ్స్ తో కలిసి కేరళ వెళ్లినప్పుడు అక్కడ ఓ జ్యోతిష్యుడు ఆమె చేయి చేసి నువ్వు హీరోయిన్ అవుతావని చెప్పాడట. ఆ సమయంలో కంగనా కు సినిమాలకు గురించి, చిత్ర పరిశ్రమ గురించి ఏమాత్రం తెలియదట. సినిమాలతో సంబంధం లేని లైఫ్ ఆమెది. ఆయన చెప్పిన మాటలను కంగనా పట్టించుకోలేదట. కానీ ఆ జ్యోతిష్యుడు చెప్పినట్లుగానే ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకపోయిన కంగనా హీరోయిన్ అయ్యింది. బాలీవుడ్ మొత్తం తనవైపు తిప్పుకునేలా చేస్తోంది.

ఈ విషయాన్ని ప్రభాస్ స్వయంగా చెప్పారు. రాధేశ్యామ్ సినిమా ప్రచార కార్యక్రమంలో ఈ విషయాన్ని ప్రభాస్ రివీల్ చేశారు. తాను కూడా జ్యోతిష్యుడిని నమ్మేవాడిని కాదని కానీ బాహుబలి తర్వాత నమ్ముతున్నట్లు తెలిపారు. బాహుబలి వంటి సినిమాలతో నాకు అవకాశం వచ్చిందంటే అది తన జీవితంలో జరిగిన మిరాకిల్ అని చెప్పారు ప్రభాస్.

Show Full Article
Print Article
Next Story
More Stories