Niharika Konidela Engagement Date: నిహారిక ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్

Niharika Konidela Engagement Date: తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో పెళ్లిళ్ల సందడి కొనసాగుతోంది. ఇటివ‌లే హీరో నితిన్‌ త‌న ప్రేయ‌సీ షాలినీలు మూడు మూళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు.

Karampoori Rajesh
Published on: 29 July 2020 3:10 PM IST
Niharika Konidela Engagement Date: నిహారిక ఎంగేజ్‌మెంట్ డేట్ ఫిక్స్
X
niharika

Niharika Konidela Engagement Date: తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌లో పెళ్లిళ్ల సందడి కొనసాగుతోంది. ఇటివ‌లే హీరో నితిన్‌ త‌న ప్రేయ‌సీ షాలినీలు మూడు మూళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు. అలాగే మ‌రో యువ‌ హీరో బల్లాల దేవుడు రానా ద‌గ్గుబాటి కూడా ఓ ఇంటివాడు కానున్నాడు. త‌న ప్రేయ‌సి మిహీకా బ‌జాజ్‌ను వ‌చ్చే నెల 8 న వివాహం చేసుకోనున్నాడు. తాజాగా కొణిదెల వారింట కూడా పెళ్లి బాజాలు మోగ‌నున్నాయి. మెగాబ్ర‌ద‌ర్ నాగ‌బాబు కూతురు నిహారిక కొణిదెల‌, గుంటూరు ఐజీ జొన్నలగడ్డ ప్ర‌భాక‌ర్ రావు త‌న‌యుడు చైత‌న్య‌ల‌కు పెళ్లి జ‌రగ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ఆగ‌స్టు 13న వీరి నిశ్చితార్థం జ‌ర‌గ‌నుంది.ఈ కార్యక్రమం కేవ‌లం కుటుంబ‌స‌భ్యుల సార‌ధ్యంలో నిర్వహించనున్నారు. ఇప్ప‌టికే ఎంగేజ్‌మెంట్‌కు సంబంధించి ఏర్పాట్లు చేస్తున్న‌ట్లు స‌మాచారం. వీరి పెళ్లి ఈ ఏడాదిలోనే ఉంటుంద‌ని నాగబాబు ఓ ఇంట‌ర్వ్యూలో తెలిపారు. కాగా.. వ‌రుణ్ తేజ్ కూడా ఓ ఇంట‌ర్వ్యూలో చెల్లెలి ఎంగేజ్‌మెంట్ డేట్‌ను తెలియ‌జేశారు.

ఇక ఒక మ‌న‌సు చిత్రంతో తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ‌కు హీరోయిన్‌గా ప‌రిచ‌యమ‌యిన మెగా డాట‌ర్ నిహారిక హ్యాపీ వెడ్డింగ్, సూర్య‌కాంతం వంటి చిత్రాల్లోనూ న‌టించారు. అశోక్ సెల్వ‌న్ హీరోగా న‌టించ‌నున్న త‌మిళ చిత్రంలోనూ న‌టించ‌నున్నారు. ఇక చైతన్య విషయానికి వస్తే... హైదరాబాద్‌లోని ఓ ఎంఎన్‌సీ కంపెనీలో బిజినెస్‌ స్ట్రాటజిస్ట్‌గా వర్క్‌ చేస్తున్నారు. హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగిన చైతన్య బిట్స్‌ పిలానీలో మాస్టర్స్‌ ఇన్‌ మ్యాథమ్యాటిక్స్‌ డిగ్రీ పట్టా పొందారు. ఆ తర్వాత ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌లో ఎమ్‌బీఏ పూర్తి చేశారు.

Karampoori Rajesh

Karampoori Rajesh

Next Story