Nagababu Comments on Niharika Marriage: నిహారిక పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగబాబు!

Nagababu Comments on Niharika Marriage: టాలీవుడ్లో ఒక్కొక్కరు మెల్లిగా పెళ్లిపీటలెక్కతున్న సంగతి తెలిసిందే.

Krishna
Published on: 3 July 2020 3:15 PM IST
Nagababu Comments on Niharika Marriage: నిహారిక పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన నాగబాబు!
X
Nagababu (File Photo)

Nagababu Comments on Niharika Marriage: టాలీవుడ్లో ఒక్కొక్కరు మెల్లిగా పెళ్లిపీటలెక్కతున్న సంగతి తెలిసిందే... ఇప్పటికే నిఖిల్ పెళ్లి చేసుకోగా త్వరలో నితిన్ కూడా పెళ్లి పీటలు ఎక్కనున్నాడు. తాజాగా మెగా వారి ఇంట్లో పెళ్లి సందడి మొదలుకానుంది. మెగా బ్ర‌ద‌ర్ నాగ‌బాబు కుమార్తె నిహారిక పెళ్లి ఫిక్స్ అయిన సంగతి తెలిసిందే.. ఏపీ పోలీస్ అధికారి కొడుకు జొన్నలగడ్డ చైతన్యతో పెద్ద‌లు మ్యాచ్ ఫిక్స్ చేశారు. ఇక నిహారిక కూడా తనకి కాబోయే భర్తను సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసింది. దీనికి సంబంధించిన ఫోటోలు వైరల్ గా మారింది.

అయితే తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో నిహారిక పెళ్లి గురించి నాగబాబు నిహారిక పెళ్లి గురించి స్పందించారు. మరి మీ అమ్మాయి నిహారిక పెళ్లి కూడా ఖాయమైంది. ఆ పెళ్లి సంగతులేంటి? ఎప్పుడు పెళ్లి పెట్టుకుంటున్నారు? అని యాంకర్ ప్రశ్నించగా త్వరలోనే నిశ్చితార్థం పెట్టుకుంటామని నాగబాబు చెప్పారు. మా ఇంట్లో పెళ్లి.. పబ్లిక్ పండుగ కాదు కాబట్టి పర్సనల్ గానే ట్రీట్ చేస్తున్నానని ఆయన అన్నారు. ప్రస్తుతం కరోనా సమయంలో పెళ్లి చేయడం కుదరకపోవచ్చునని నాగబాబు అన్నారు. అయితే వచ్చే ఏడాది నిహారిక పెళ్లి చేస్తారని తెలుస్తోంది..

ఇక నిహారిక విషయానికి వచ్చేసరికి.. మెగా కాంపౌండ్ నుండి తొలి హీరోయిన్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది నిహారిక‌..వెబ్ సిరీస్ లనుంచి మొదలైన ఆమె ప్రయాణం.. ఒక మ‌న‌సు,హ్యాపీ వెడ్డింగ్‌, సూర్యకాంతం, సైరా వంటి చిత్రాలలో నటించింది. ప్రస్తుతం చిరంజీవి, కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఆచార్య సినిమాలో కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని సమాచారం.


Krishna

Krishna

Next Story