Akkineni Nagarjuna: మళ్లీ బుల్లితెర కోసం సినిమా ఆపేసిన కింగ్ నాగార్జున

Akkineni Nagarjuna: కింగ్ నాగార్జున మళ్లీ బిగ్ బాస్ ని హోస్ట్ చేయబోతున్నాడా?

Arun Chilukuri
Updated on: 15 July 2023 8:30 PM IST
Nagarjuna Stops Film for Big Boss
X

Akkineni Nagarjuna: మళ్లీ బుల్లితెర కోసం సినిమా ఆపేసిన కింగ్ నాగార్జున

Akkineni Nagarjuna: కింగ్ నాగార్జున మళ్లీ బిగ్ బాస్ ని హోస్ట్ చేయబోతున్నాడా? సినిమాలేవీ చేసినా కలిసి రావట్లేదని రూట్ మార్చాడా? .. ప్రజెంట్ తను చేయాలనుకున్న మూవీని కూడా పక్కన పెట్టి, బిగ్ బాస్ కొత్త సీజన్ మీద ఫోకస్ పెంచాడంటున్నారు.. నిజమేనా? ఇంతకి కింగ్ నాగార్జున దారెటు...?

నాగార్జున ఏం చేసినా థియేటర్స్ లో పంచ్ పడుతోంది. అందుకే కలిసొచ్చే రూట్లో స్మాల్ స్క్రీన్ మీద బిగ్ బాస్ హోస్ట్ గా మారుతున్నాడట. ఏడో సీజన్ కి తనే వ్యాఖ్యాతగా వస్తున్నాడట. బిగ్ బాస్ లో ఒక సీజన్ ఎన్టీఆర్, మరోసీజన్ నాని వ్యాఖ్యాతగా చేశారు. ఐతే మిగతా సీజన్లన్నీ కింగ్ నాగార్జునే హోస్ట్ గా కనిపించాడు. ఐతే తారక్, నానిల పేర్లు కూడా కొత్త సీజన్ తాలూకు గుసగుసల్లో వినిపించాయి.

తారక్, నాని హోస్ట్ గా చెరో సీజన్ ని పూర్తి చేశారు. ఐతే మిగతా సీజన్లన్నీ నాగార్జునే సక్సెస్ చేశాడు. కాకపోతే ఏడో సీజన్ కి నాగ్ వ్యాఖ్యాత కాదని అప్పట్లో టాక్ వచ్చిన ఇప్పుడు మాత్రం తనే హోస్ట్ అని క్లారిటీ వస్తోంది. ప్రోమో సందడి షురూ అవుతోంది.

ఇక నాగ్ కెరీర్ విషయానికొస్తే ఈపాటికే ధమాకా రైటర్ ప్రసన్న మేకింగ్ లో సినిమా మొదలవ్వాలి. కాని ఎందుకనో ప్రాజెక్ట్ ని హోల్డ్ లో పెట్టాడట నాగ్. ప్రజెంట్ ఏ సినిమా చేసినా కలిసి రావట్లేదని, నాగ్ ఇలా బుల్లి తెరవైపు అడుగులేస్తున్నాడంటున్నారు. కింగ్ నాగార్జన ప్రజెంట్ బిగ్ బాస్ కొత్త సీజన్ తో జోరు పెంచి, తర్వాత దసరాకు కొత్త సినిమాతో బిజీ అవుతాడట. అలా బిగ్ స్క్రీన్ కి చిన్న బ్రేక్ తీసుకుని, స్మాస్ స్క్రీన్ కి అతుక్కుపోబోతున్నాడట.

Arun Chilukuri

Arun Chilukuri

Next Story