'బంగార్రాజు' విడుదల అప్పుడేనట

బంగార్రాజు విడుదల అప్పుడేనట
x
Highlights

ఒకవైపు అమాయకుడైన రాము పాత్రలో మరొకవైపు సరదాగా కనిపించే బంగార్రాజు గా రెండు విభిన్నమైన పాత్రల్లో నటించిన నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు.

ఒకవైపు అమాయకుడైన రాము పాత్రలో మరొకవైపు సరదాగా కనిపించే బంగార్రాజు గా రెండు విభిన్నమైన పాత్రల్లో నటించిన నాగార్జున 'సోగ్గాడే చిన్ని నాయనా' సినిమా తో ప్రేక్షకులను బాగానే ఆకట్టుకున్నాడు. సినిమా అంత పెద్ద హిట్ అవ్వడానికి కారణం నాగార్జున నే అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా బంగార్రాజు పాత్రలో అదరగొట్టిన నాగ్ మళ్ళీ అదే పాత్రలో కనిపించనున్న సంగతి తెలిసిందే. కళ్యాణ్ కృష్ణ దర్శకత్వంలో 'సోగ్గాడే చిన్ని నాన్యనా' సినిమా ప్రీక్వెల్ గా పూర్తిగా బంగార్రాజు పాత్ర చుట్టూ తిరిగే సినిమా 'బంగార్రాజు'.

ఈ సినిమా పై ఫ్యాన్స్ కు భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా ఎప్పుడెప్పుడు విడుదల అవుతుందా అని ఆసక్తిగా ఏడుతుచూస్తున్న ఫ్యాన్స్ కోసం సంక్రాంతి సందర్భంగా ఒక శుభవార్త చెప్పారు దర్శకనిర్మాతలు. "వచ్చే ఏడాది ఈ సమయానికి బంగార్రాజు మీ అభిమాన థియేటర్స్ లో..!!!" అని వార్తను ట్వీట్ చేశారు చిత్ర యూనిట్. అంటే వచ్చే ఏడాది అనగా 2020 లో సంక్రాంతి కానుకగా 'బంగార్రాజు' గా మనముందుకు మళ్ళీ రానున్నారు అన్నమాట. ఇక 'ఆఫీసర్', 'దేవదాసు' లాంటి ఫ్లాపుల తరువాత నాగ్ ఈసారి కచ్చితంగా హిట్ అందుకుంటారు అని ఫ్యాన్స్ విశ్వసిస్తున్నారు.

Show Full Article
Print Article
Next Story
More Stories